Social 1080×1350 • Multi-page
06-07-2025 BREAKING NEWS 09:59 PM
swarnodayam.com
Telugu Daily News

ఘనంగా భీరన్నకు యాదవుల బోనాలు

ఘనంగా భీరన్నకు యాదవుల బోనాలు
IMG-20250706-WA0034

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని యాదవ నగర్ నుండి యాదవ సంఘం అధ్యక్షులు బద్దుల రాజ్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక సిర్సపల్లి క్రాస్ రోడ్డులో గల బీరన్న దేవాలయంకు భారీ ఎత్తున మహిళలు బోనాలతో ర్యాలీగా బయలుదేరి భీరన్నకు బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా భీరన్నకు మొక్కులు చెల్లించారు. సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో కలిసి అందరూ ఉండాలని దేవుని ప్రార్ధించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం ప్రధాన కార్యదర్శి భాషబోయిన చిన్న రవి, కార్యవర్గ సభ్యులు సింగరేణి రవి, గండ్రకోట సారయ్య, గాదం స్వరూప, మక్కపల్లి కుమార్ స్వామి, భాషబోయిన చిన్న శ్రీనివాస్, భాషబోయిన రవి, ఓదెలు, రవి, మొండయ్య, రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Oplus_16908288
Oplus_16908288

బీరన్నకు బోనాల సమర్పించేందుకు ర్యాలీగా తరలి వెళ్తున్న యాదవులు..

———————++++++++++—————–

#పత్రికా ప్రకటనలు (యాడ్స్)#

——————–++++++++++——————

&వార్షికోత్సవ శుభాకాంక్షలు&

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!