Social 1080×1350 • Multi-page
07-07-2025 BREAKING NEWS 08:40 PM
swarnodayam.com
Telugu Daily News

చెల్పూర్‌లో జయన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం… – 1500 మందికి పరీక్షలు… – 250 మందికి శస్త్రచికిత్సలకు హైదరాబాద్‌కు తరలింపు.

చెల్పూర్‌లో జయన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం… – 1500 మందికి పరీక్షలు… – 250 మందికి శస్త్రచికిత్సలకు హైదరాబాద్‌కు తరలింపు.
IMG-20250707-WA0079

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ జూలై 7: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం చెల్పూర్ గ్రామంలో జయన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం మెగా ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించారు. చెల్పూర్‌తో పాటు చుట్టుప్రక్కల గ్రామాలైన సిర్సపల్లి, వెంకట్రావుపల్లె, పోతిరెడ్డిపేట, జూపాక, బోత్తలపల్లె వంటి పలు గ్రామాల నుండి దాదాపు 1500 మంది గ్రామస్తులు తమ కంటి సమస్యలకు పరీక్షలు చేయించుకునేందుకు తరలివచ్చారు.
గ్రామ ప్రజల కంటి సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి ఉదయం నుంచే వందలాది మంది తరలివచ్చారు. హైదరాబాద్‌లోని శంకర్ ఐ హాస్పిటల్ నుండి వచ్చిన అనుభవజ్ఞులైన కంటి వైద్య నిపుణుల బృందం అత్యాధునిక పరికరాలతో సుమారు 1500 మందికి పూర్తిస్థాయి కంటి పరీక్షలు నిర్వహించింది. కంటిచూపు, శుక్లాలు, గ్లకోమా వంటి వివిధ రకాల సమస్యలను ఈ పరీక్షల్లో గుర్తించారు. పరీక్షల అనంతరం, ప్రాథమిక అంచనా ప్రకారం 250 మందికి కంటి ఆపరేషన్లు అవసరమని వైద్యులు గుర్తించారు. సరైన సమయంలో శస్త్రచికిత్సలు చేయించుకోకపోతే కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉందని గుర్తించిన వైద్యులు, వారికి తక్షణమే ఆపరేషన్లు చేయించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆపరేషన్లు అవసరమైన ఈ 250 మందిని మెరుగైన వైద్యం, శస్త్రచికిత్సల కోసం హైదరాబాద్‌లోని ప్రఖ్యాత శంకర్ ఐ హాస్పిటల్‌కు ప్రత్యేక వాహనాల్లో తరలించారు. ఆపరేషన్ల ఖర్చులతో సహా పూర్తి వైద్య ఖర్చులను జయన్న ఫౌండేషనే భరిస్తుందని ఫౌండేషన్ చైర్మన్ గుడిపాటి సరిత జైపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ శిబిరం సరిత జైపాల్ రెడ్డి ప్రత్యేక పర్యవేక్షణలో నిర్వహించారు.
జయన్న ఫౌండేషన్ గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్య సంరక్షణకు అందిస్తున్న ఈ సేవలను గ్రామస్తులు ఎంతగానో అభినందించారు. ఇటువంటి ఉచిత వైద్య శిబిరాల ద్వారా పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని చెల్పూర్ గ్రామ మాజీ సర్పంచ్ పొలంపల్లి శ్రీనివాస్ రెడ్డితో పాటు పలు గ్రామాల ప్రజలు మరియు గ్రామ పెద్దలు పేర్కొన్నారు. డాక్టర్ల బృందానికి, జయన్న ఫౌండేషన్ చైర్మన్ సరిత జైపాల్ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని గ్రామస్తులు కోరారు.

ఉచిత కంటి వైద్య శిబిర నిర్వహిస్తున్న హైదరాబాద్ కు చెందిన శంకర్ ఐ హాస్పిటల్ ప్రత్యేక కంటి వైద్యులు..
Oplus_16908288

కంటి వైద్య శిబిరం వద్ద రోగులను వివరాలను అడిగి తెలుసుకుంటున్న జయన్న ఫౌండేషన్ నిర్వాహకుడు జైపాల్ రెడ్డి

ఉచితంగా కంటికి శాస్త్ర చికిత్సలు చేసుకున్న వారితో జయన్న ఫౌండేషన్ నిర్వాహకులు, చెల్పూరు గ్రామం మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి..
కంటి శాస్త్ర చికిత్సలకు ఎంపికైన వృద్ధులను హైదరాబాద్ శంకరయ్య హాస్పిటల్ కు ప్రత్యేక వాహనంలో తరలిస్తున్న జైన ఫౌండేషన్ నిర్వాహకులు జైపాల్ రెడ్డి సరిత..

—————————-+++++++++——————

@పత్రిక ప్రకటనలు (యాడ్స్)&

————————-++++++++—————-

#వార్షికోత్సవ శుభాకాంక్షలు#

Oplus_16908288

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!