Social 1080×1350 • Multi-page
07-07-2025 BREAKING NEWS 09:48 PM
swarnodayam.com
Telugu Daily News

ఆడబిడ్డల పక్షాన పోరాడుతా.. పేదల హక్కుల కోసం జైలుకెళ్లడానికైనా సిద్ధం! .. – కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

ఆడబిడ్డల పక్షాన పోరాడుతా.. పేదల హక్కుల కోసం జైలుకెళ్లడానికైనా సిద్ధం! .. – కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
IMG-20250707-WA0127

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
ఆపదలో ఉన్న నిరుపేదలకు అండగా నిలుస్తానని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఈరోజు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కమలాపూర్ మండలానికి చెందిన దాదాపు 100 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అలాగే హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో ప్రతి లబ్ధిదారుని ఇంటికి వెళ్లి సోమవారం 31 మంది లబ్ధిదారులకు 7,88,500 విలువ గల సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపద వచ్చి ప్రజలు తన ఇంటికి అర్ధరాత్రి వచ్చిన వారికి సహాయం చేయడానికి ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని అన్నారు. సిఎంఆర్ఎఫ్ పేదలకు వరమని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి జైలుకు వెళ్లడానికైనా సిద్ధమేనని అన్నారు.

ఆడబిడ్డల పక్షాన పోరాటం చేస్తా..
ఆడ బిడ్డల పక్షాన పోరాటం చేస్తానని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం కమలాపూర్ మండలానికి చెందిన 100 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భారత దేశంలోనే ఆడబిడ్డల కోసం ఆలోచించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని, బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ కిట్ కళ్యాణ లక్ష్మి వంటి పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 1,00,116, లో కళ్యాణంలో కట్నంగా ఇచ్చి ఆడపిల్లలకు మేనమామ అయ్యాడని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కేసీఆర్ కిట్ నిలిపివేయడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు తగ్గాయని అన్నారు. కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రభుత్వం కొనసాగించాలని డిమాండ్ చేశారు.
బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై రాజకీయం చేయకుండా అమలు చేయాలన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రారంభమైన ఆరోగ్య శ్రీ పథకాన్ని కేసీఆర్ మార్చకుండా కొనసాగించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం 15000 రూపాయలు వారి అకౌంట్లో జమ చేయాలని అన్నారు. మహిళలకు ఇచ్చిన హామీ ప్రకారం నెలకు రూ.2500 ఇవ్వాలనీ, హుజురాబాద్ నియోజకవర్గంలోని లక్షా 26 వేల మంది మహిళలకు న్యాయం చేసిన తర్వాతే ఓట్లు అడగాలనీ, లేకపోతే మహిళలే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి అన్నారు. కాలేశ్వరం నీటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బనకచర్ల ప్రాజెక్టు ద్వారా తెలంగాణ నీళ్లను ఆంధ్రకు తరలిస్తే ఊరుకోబమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కమలాపూర్ తాసిల్దార్ సురేష్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, హుజురాబాద్ మాజీ ఎంపీపీ ఇరుమళ్ళ రాణి- సురేందర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ పట్టణ మండల శాఖ అధ్యక్షులు కొలీపాక శ్రీనివాస్, సంఘము ఐలయ్య, సీనియర్ నాయకులు తక్కలపల్లి సత్యనారాయణ, మాజీ జెడ్పిటిసి నవీన్, సేనారెడ్డి, కృష్ణప్రసాద్, రవీందర్ రెడ్డి, మాజీ సర్పంచులు, ఎంపిటిసిలు కార్యకర్తలు పాల్గొన్నారు.

Oplus_16908288

పెద్దపాపయ్యపల్లి గ్రామంలో లబ్ధిదారులకు చెక్కులు అందజేస్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి..

చెల్పూరు గ్రామంలో లబ్ధిదారులకు చెక్కు పంపిణీ చేసి మాట్లాడుతున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి..

Oplus_16908288
Oplus_16908288

కమలాపూర్ మండలానికి చెందిన లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు..

Oplus_16908288

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడుతున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి..

——————–+++++++—————–

@పత్రికా ప్రకటనలు (యాడ్స్)@

——————-++++++++—————-

&వార్షికోత్సవ శుభాకాంక్షలు&

Oplus_16908288

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!