Social 1080×1350 • Multi-page
07-07-2025 BREAKING NEWS 11:41 PM
swarnodayam.com
Telugu Daily News

చేప పిల్లల పెంపకంలో ప్రథమస్థానంలో కరీంనగర్ – మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి

చేప పిల్లల పెంపకంలో ప్రథమస్థానంలో కరీంనగర్  – మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి
IMG_20250707_233735

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
కరీంనగర్ జిల్లా ఉజ్వల పార్క్ సమీపంలోని చేప పిల్లల పెంపక కేంద్రాన్ని మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి సందర్శించారు. అనంతరం మత్స్యకారుల సంక్షేమంపై నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, మేడిపల్లి సత్యం, సాట్ చైర్మన్ శివసేన రెడ్డి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తదితరులు పాల్గొన్నారు.మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ…
గత 10 సంవత్సరాల్లో మత్స్య శాఖలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ, మొదటి సంవత్సరం చేప పిల్లల పంపిణీలో కొంత ఆలస్యం జరిగిందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు మత్స్య సంపదపై ఆధారపడి జీవిస్తున్నాయని తెలిపారు. ప్రకృతిసిద్ధంగా పెరిగే చేపలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తున్నాయని పేర్కొన్నారు.

కరీంనగర్ కీలక కేంద్రంగా మారుతోంది: లోయర్ మానేరు, మిడ్ మానేరు, ఎల్లంపల్లి డ్యామ్‌లు సహా అనేక చెరువుల ద్వారా చేపల ఉత్పత్తిని ప్రభుత్వం విస్తృతంగా ప్రోత్సహిస్తోందన్నారు.
ఇక్కడ ఉత్పత్తయ్యే చేపలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి అవుతున్నాయని వివరించారు. చేప పిల్లల పెంపకం కరీంనగర్ జిల్లాలో ప్రథమస్థానంలో ఉందని, రాష్ట్రవ్యాప్తంగా నలుగురు జిల్లాలను కేంద్రంగా చేసుకుని చేప పిల్లల ఉత్పత్తి సాగుతోందని తెలిపారు. స్థానిక ఉత్పత్తికి ప్రాధాన్యత.
ఇతర ప్రాంతాల నుండి దిగుమతులకు బదులుగా స్థానికంగా మంచి నాణ్యతతో చేప పిల్లలను సరఫరా చేస్తామన్నారు. అధికారుల పర్యవేక్షణలో సరైన విధంగా పెంపకం కొనసాగుతోందని తెలిపారు. భవిష్యత్ కార్యాచరణ:
మత్స్యకారులకు మార్కెట్ ఏర్పాటుతో పాటు, ఎగుమతులకు సహకారం, కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు వంటి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరఫున అన్ని రకాల ప్రోత్సాహకాలు కల్పిస్తూ మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రులు భరోసా ఇచ్చారు.

చేప పిల్లల పెంపకంను పరిశీలిస్తున్న మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి….

————–+++++++++——————-

#పత్రిక ప్రకటనలు (యాడ్స్)#

——————–++++++——————-

&వార్షికోత్సవ శుభాకాంక్షలు &

Oplus_16908288

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!