Social 1080×1350 • Multi-page
08-07-2025 BREAKING NEWS 12:41 AM
swarnodayam.com
Telugu Daily News

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై హుజురాబాద్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు.. – మాలలకు కౌశిక్ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలి.

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై హుజురాబాద్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు.. – మాలలకు కౌశిక్ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలి.
IMG-20250708-WA0002

– మాలలను చిన్న చూపు చూస్తూ శునకానందం పొందుతున్న కౌశిక్ రెడ్డి

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని వివిధ వాట్సాప్ గ్రూప్ లలో మాలజాతి యుద్ధ వీరుడు మాల కన్నమదాసు చిత్రపటాన్ని అవమానపరుస్తూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, పరకాల సమ్మయ్య గౌడ్ లు కన్నమదాసు తల భాగంలో కౌశిక్ రెడ్డి తల ఫోటో పెట్టి మాల కన్నమదాసును, మాలలను అవమానపరుస్తూ మాలల మనోభావాలను దెబ్బతీసే విధంగా వాట్సాప్ గ్రూప్ లలో ఫోటోలను సర్క్యూలేట్ చేస్తూ మాల కన్నమదాసును అవమాన పరచడాన్ని తీవ్రంగా ఖండిస్తూ హుజురాబాద్ పోలీస్ స్టేషన్ లో మాల కులస్థులు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, పరకాల సమ్మయ్య గౌడ్ లపై పిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాల కులస్థులు మాట్లాడుతు పాడి కౌశిక్ రెడ్డి, పరకాల సమ్మయ్య గౌడ్ లు బెషరతుగా మాలలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. లేని పక్షంలో హుజురాబాద్ నియోకవర్గంతో పాటు ,తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాలల ఆధ్వర్యంలో నిరసన, ఆందోలన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కౌశిక్ రెడ్డి తన షోపు టాపుల కోసం మాలజాతిని తక్కువ చేయడం సరైంది కాదని, మాల కన్నమదాసు ను అవహేళన చేస్తూ పాడి కౌశిక్ రెడ్డి శునకానందం పొందుతున్నారని, మాలలను చిన్న చూపు చూస్తున్న కౌశిక్ రెడ్డి ఎంఎల్ఏ పదవికి అనర్హుడని అన్నారు. ఈ కార్యక్రమంలో సొల్లు బాబు,సందమల్ల నరేష్, మాల స్టూడెంట్ జాక్ చైర్మన్ మాదాసు రాహుల్, శీలం రాజు, పసుల స్వామి, జంగ అనిల్ కుమార్, తొగరు విజెందర్, ముక్క రమేష్, తాడెం నాగరాజు, ముక్క రవితేజ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై హుజురాబాద్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేస్తున్న మాల కులస్తులు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!