Social 1080×1350 • Multi-page
08-07-2025 BREAKING NEWS 11:49 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్, జమ్మికుంట పట్టణాలలో మైక్రో ఫైనాన్స్ ల ఆగడాలు.. మైక్రో ఫైనాన్స్ లకు అడ్డుకట్ట వేయాలి… – సిపిఐ నాయకులు లింగంపల్లి అన్వేష్ డిమాండ్

హుజురాబాద్, జమ్మికుంట పట్టణాలలో మైక్రో ఫైనాన్స్ ల ఆగడాలు.. మైక్రో ఫైనాన్స్ లకు అడ్డుకట్ట వేయాలి… – సిపిఐ నాయకులు లింగంపల్లి అన్వేష్ డిమాండ్
IMG-20250708-WA0132

– రోజువారి కూలీలే వీరి టార్గెట్

– డబ్బులు ఆశ చూపి నరకయాతన పెడుతున్న మైక్రో ఫైనాన్స్ లు

– మైక్రో ఫైనాన్స్ లకు అడ్డుకట్ట వేయాలని

– సిపిఐ నాయకులు లింగంపల్లి అన్వేష్ డిమాండ్

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్, జమ్మికుంట పట్టణ పేదప్రజల అవసరాన్ని ఆసరాగా తీసుకుని పలు మైక్రో ఫైనాన్స్ కంపెనీలు మధ్యావర్థుల ద్వారా ప్రజలకు డబ్బు ఆశ చూపించి రోజువారి కూలీ చేసుకునే మధ్యతరగతి కుటుంబాలనే టార్గెట్ చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని సిపిఐ నాయకులు లింగంపల్లి అన్వేష్ ఆరోపించారు. ఊరిలో ఒక మధ్యవర్తిని ఎంపిక చేసుకొని 5గురు సభ్యులతో కూడిన ఒక గ్రూప్ ఏర్పాటు చేసి కమిషన్, ఇన్సూరెన్సు పేరు మీద సుమారు 5000 రూపాయలవరకు కట్ చేసుకుని మిగత రూపాయలు బెనిఫిషర్ కి ఇచ్చి ప్రతి నెల 4నుండి10 వ తారీకు లోపల కట్టమని అదేశించి ఒకవేళ సమయానికి చెల్లించకపోతే రానున్న కాలంలో సిబిల్ స్కోర్ తగ్గుతుందని ఫ్యామిలీలోని పిల్లలకు కూడా నోటీసులు వస్తాయని అలాగే వారి ఉద్యోగాలకు ఇబ్బందులు అవుతాయని ఇలా బెదిరిస్తూన్నారన్నారు. గ్రూప్ లోని 4గురు కట్టి ఒక్కరు కట్టకున్న మొత్తం గ్రూపుసభ్యుల మీద మానసిక ఒత్తిడి తీసుకువచ్చి బెదిరింపులకు పాల్పడుతున్నా పలు మైక్రో ఫైనాన్స్ కంపెనీలపై సంబంధిత అధికారులు చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సిపిఐ జమ్మికుంట పట్టణ నాయకులు లింగంపెల్లి అన్వేష్ డిమాండ్ చేశారు.

సిపిఐ నాయకులు లింగంపల్లి అన్వేష్..

————————–++++++++—————-

పత్రికా ప్రకటనలు (యాడ్స్)

———————-++++++++—————

@వార్షికోత్సవ శుభాకాంక్షలు@

Oplus_16908288

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!