Social 1080×1350 • Multi-page
09-07-2025 BREAKING NEWS 05:41 PM
swarnodayam.com
Telugu Daily News

కేంద్ర కార్మిక ఉద్యోగ సమాఖ్య తలపెట్టిన ఒక్క రోజు దేశవ్యాపిత సమ్మె రాష్ట్రంలో విజయవంతం.

కేంద్ర కార్మిక ఉద్యోగ సమాఖ్య తలపెట్టిన ఒక్క రోజు దేశవ్యాపిత సమ్మె రాష్ట్రంలో విజయవంతం.
IMG-20250709-WA0093

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ జూలై09: ఉద్యోగ కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర ఉద్యోగ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు జులై 09 2025 న తెలంగాణ వ్యాప్తంగా nfpe యూనియన్ అనుబంధ సంఘాల ఉద్యోగులు చీఫ్ పిఎంజీ కార్యాలయం దాక్ సదన్ లో తలపెట్టిన ఒకరోజు సమ్మెలో పాల్గొనడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ, ఏపి కేంద్ర ఉద్యోగ సమాఖ్య ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ అజీజ్ మాట్లాడుతూ
8 వ వేతన సంఘాన్ని తక్షణమే వెర్పాటు చెయ్యాలని, పాత పెన్షన్ విధానాన్ని పునర్రీద్ధాంచాలి అని, ఎన్ ఎఫ్ పి ఈ సంఘానికి కోర్టు ఇచ్చిన తీర్పును అమలు పరచి గుర్తింపును పునరుద్దరించాలన్నారు. నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేసి పాత కార్మిక చట్టాలను యధావిధిగా కొనసాగించాలని, 18 నెలల డీఏ బకాయిలని విడుదల చేయాలనీ, కారుణ్య నియామకాలలో 5% సిలింగ్ ఎత్తివేయాలని, జీడీఎస్ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగనించాలని, ఔటసోర్సింగ్ ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన జీతం అందించాలని తెలంగాణ పోస్టల్ ఉద్యోగులు సమ్మెలో పాల్గొని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.
ఈ కార్యక్రమంలో ఎన్ ఎఫ్ పి ఈ రాష్ట్ర కన్వీనర్ కామ్రేడ్ శ్రవణ్ కుమార్, అనుబంధ సంఘాల రాష్ట్ర కార్యదర్శులు కామ్రేడ్ యు మహేందర్, చారీ, శ్రీకాంత్, సోమేశ్, ముతేష్, మధుసూదన్, సీనియర్ కామ్రేడ్ డి ఎన్ మూర్తి,జనాభాయ్, లక్ష్మి, కవిత
పెన్షనర్ సంఘ నాయకులు మరియు పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొన్నారు

nfpe యూనియన్ అనుబంధ సంఘాల ఉద్యోగులు చీఫ్ పిఎంజీ కార్యాలయం దాక్ సదన్ లో ఒకరోజు సమ్మెలో పాల్గొన్న దృశ్యంలు ..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!