09-07-2025 NORMAL NEWS 08:53 PM
swarnodayam.com
Telugu Daily News
09-07-2025 08:53 PM By Mandala Yadagiri

ఎంపీ గారు హుజురాబాద్ కు రైలు మార్గం ఏది !? – కాంగ్రెస్ నేత సొల్లు బాబు.

ఎంపీ గారు హుజురాబాద్ కు రైలు మార్గం ఏది !? – కాంగ్రెస్ నేత సొల్లు బాబు.
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: ఎన్నికల సమయంలో హుజురాబాద్ కు రైలు మార్గాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆ మాటే మరిచారని కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా అధికార ప్రతినిధి సొల్లు బాబు అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ…హసన్ పర్తి నుండి హుజురాబాద్ మీదుగా కరీంనగర్ ను కలుపుతూ రైలు మార్గం ఏర్పాటు చేస్తామని చెప్పిన ఎంపీ బండి సంజయ్ కేంద్ర మంత్రి అయినప్పటికి నిర్లక్ష్యం చేయడమేమిటని అన్నారు. ఇప్పటివరకు రైలు మార్గం పనుల సర్వే నే చేపట్టలేదని అన్నారు.
కేంద్ర ప్రభుత్వంలో ముఖ్యమైన స్థానంలో ఉన్న బండి సంజయ్ హుజురాబాద్ కు రైలు మార్గం ఏర్పాటు విషయం శ్రద్ధ వహించి తొందరగా పనులు జరిగేలా చూడాలని ఆయన అన్నారు. హుజురాబాద్ ప్రజలను మభ్యపెట్టి ఓట్లు పొందిన ఆయన వెంటనే దీనిపై స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు.

కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా అధికార ప్రతినిధి సొల్లు బాబు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!