Social 1080×1350 • Multi-page
09-07-2025 BREAKING NEWS 11:27 PM
swarnodayam.com
Telugu Daily News

11 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్.. – రూ. 18 750లు, 11 సెల్ ఫోన్లను, పేక ముక్కలు సీజ్

11 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్.. – రూ. 18 750లు, 11 సెల్ ఫోన్లను, పేక ముక్కలు సీజ్
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని వరంగల్ రోడ్డులోని ఓ ఫంక్షన్ హాల్ లో బుధవారం రాత్రి మూడుముక్కల (పేకాట) ఆడుతున్నారని సమాచారం రాగా హుజురాబాద్ పోలీసులు పేకాట ఆడుతున్న 11 మందిని పట్టుకొని వారి దగ్గర నుండి రూ. 18 750 రూపాయలు, 11 సెల్ ఫోన్లను, పేక ముక్కలు సీజ్ చేసినట్లు టౌన్ సీఐ కరుణాకర్ తెలిపారు. పేకాట ఆడుతున్న ఫంక్షన్ హాల్ ఓనర్ పై కూడా కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. పట్టుబడిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.
తిప్పబత్తిని చంద్రయ్య (హుజురాబాద్), మంద కుమారస్వామి (కందుగుల), జంగ సంపత్ (మల్లారెడ్డిపల్లి), తాటికంటి తిరుపతి (నర్సింగాపూర్), మంద సతీష్ (కందుగుల), ముషం తిరుపతి (రంగాపూర్), పోలంపల్లి శ్రీరామ రెడ్డి (శాలపళ్లి), కడుగురి సంపత్ (హుజురాబాద్), మహమ్మద్ ఇషాక్ (హుజురాబాద్), ఎడ్డబోయిన చంద్రయ్య (రంగాపూర్) మాదిరెడ్డి చంద్రారెడ్డి (జమ్మికుంట) అనే వారిని అరెస్టు చేసినట్లు సిఐ తెలిపారు. ఎవరైనా ప్రభుత్వం నిషేధించిన మూడు ముక్కలాట ఆడితే చట్టారీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ హెచ్చరించారు.

Oplus_16908288

—————+++++++——————-

పత్రికా ప్రకటనలు (యాడ్స్)

———————+++++++——————-

@వార్షికోత్సవ శుభాకాంక్షలు@

Oplus_16908288

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!