Social 1080×1350 • Multi-page
10-07-2025 BREAKING NEWS 07:22 PM
swarnodayam.com
Telugu Daily News

బిజెపి ఆధ్వర్యంలో గురువులకు సన్మానం.. ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు.

బిజెపి ఆధ్వర్యంలో గురువులకు సన్మానం.. ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు.
IMG_20250710_191747

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
గురుపౌర్ణమి పండుగను పురస్కరించుకొని గురువారం హుజురాబాద్ పట్టణంలో బిజెపి ఆధ్వర్యంలో పలువురు గురువులను సన్మానించారు. గురు పూర్ణిమ సందర్భంగా వేద పండితుడీని, పలువురు ప్రిన్సిపాల్ లను, ప్రధానోపాధ్యాయులను, ఉపాధ్యాయులను శాల్వలతో సత్కరించి వారి ఆశీర్వచనాలను తీసుకున్నారు. అనంతరం బిజెపి పట్టణ అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ…ప్రపంచంలో తల్లిదండ్రుల తర్వాత మనను మనిషిగా మార్చి తీర్చిదిద్దిన వ్యక్తులు గురువులని అన్నారు. మనకు జ్ఞానాన్ని బోధించిన గురువును మర్చిపోతే తల్లిని మర్చిపోయినట్లేనని అన్నారు. గురువుల ఆశీస్సులతో గొప్పవారిగా మనం మారుతామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ వేద పండితులు దత్తత్రేయ శర్మ, ప్రభుత్వ డీగ్రీ, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్ లు డాక్టర్ ఇందిరాదేవి, ఆంజనేయరావు, హై స్కూల్స్ ప్రధానోపాధ్యాయులు తిరుమల, అరుణ తదితరులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు గంగిశెట్టి ప్రభాకర్, తూముల శ్రీనివాస్, మాజీ ఫ్లోర్ లీడర్ కౌన్సిలర్ పైళ్ల వెంకటరెడ్డి నల్ల సుమన్ , నాయకులు యాంసాని శశిధర్, నరాల రాజశేఖర్, అంకతి వాసు, పోతుల సంజీవ్, బోరగాల సారయ్య, ఒడ్నాలా చంద్రిక, కోలిపాక వెంకటేష్, రాజేష్ కన్న, బెజ్జంకి రాజేందర్, గంధం సంతోష్, పర్థం రాము, విజయ్, తూర్పాటి సునీల్, పర్థం అనిల్ తదితరులు పాల్గొన్నారు.

ప్రముఖ వేద పండితుడు అవధానుల దత్తాత్రేయ శర్మను సత్కరిస్తున్న బిజెపి నాయకులు..

డిగ్రీ, జూనియర్ కాలేజీ ల ప్రిన్సిపాల్సలను సత్కరిస్తున్న బిజెపి నాయకులు.

బాలికల, బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులను శాలువాలతో సత్కరిస్తున్న బిజెపి నాయకులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!