Social 1080×1350 • Multi-page
10-07-2025 BREAKING NEWS 07:38 PM
swarnodayam.com
Telugu Daily News

బిఆర్ఎస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలి.. – మాల కులస్తుల పంచాయితీలోకి కాంగ్రెస్ పార్టీని లాగడం సరైనది కాదు.. – కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జ్ మిడిదొడ్డి రాజు

బిఆర్ఎస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలి.. – మాల కులస్తుల పంచాయితీలోకి కాంగ్రెస్ పార్టీని లాగడం సరైనది కాదు.. – కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జ్ మిడిదొడ్డి రాజు
Oplus_16908288

– కౌశిక్ రెడ్డి పై మాల కులస్తులు ఫిర్యాదు చేస్తే కాంగ్రెస్ పార్టీని దూషించడం ఏమిటి..

– బిఆర్ఎస్ నాయకులు నిజా నిజాలు ఏమిటో తెలుసుకొని మాట్లాడాలి.

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: బిఆర్ఎస్ పార్టీ నాయకులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, లేదంటే సహించేది ఉండదని కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జ్ మిడిదొడ్డి రాజు అన్నారు. మాల కులస్తుల ఆరాధ్యుడు మాల కన్నమదాసును అవమానించిన పాడి కౌశిక్ రెడ్డిపై మాల కులస్తులు హుజురాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే ఆ విషయాన్ని కాంగ్రెస్ పార్టీకి అంటగడుతూ బిఆర్ఎస్ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరైనది కాదని పేర్కొన్నారు. అసత్యాలను ప్రచారం చేయడంలో బిఆర్ఎస్ నాయకులు ముందుంటారని తెలపడానికి ఈ సంఘటన ఉదాహరణ అని తెలిపారు. మాల కులస్తుల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా మాల, మాదిగల మధ్య అల్లర్లు సృష్టించడానికి పాడి కౌశిక్ రెడ్డి ప్రయత్నిస్తూ బిఆర్ఎస్ లో ఉన్నటువంటి మా మాదిగ నాయకులతో మాలకులస్తులపై దుర్భాషలాడించడం ఏమిటని మిడిదొడ్డి రాజు ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డికి రాజకీయంగా ఎలాంటి ఆపద వచ్చినా మా మాదిగ నాయకులను, సోదరులను వాడుకోవడం అలవాటైపోయిందని, మరోసారి కాంగ్రెస్ పార్టీపై అబద్ధాలు ప్రచారం చేస్తూ దుర్భాషలాడితే చూస్తూ ఊరుకోబోమని రాజు హెచ్చరించారు.

కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జ్ మిడిదొడ్డి రాజు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!