11-07-2025 NORMAL NEWS 04:17 PM
swarnodayam.com
Telugu Daily News
11-07-2025 04:17 PM By Mandala Yadagiri

మాంటిస్సోరిలో ఘనంగా గోరింటాకు పండగ.

మాంటిస్సోరిలో ఘనంగా గోరింటాకు పండగ.
IMG-20250711-WA0159

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఆషాడ మాసం పురస్కరించుకొని పట్టణంలోని కాకతీయ కాలనీలో గల మాంటిస్సోరి పాఠశాలలో గోరింటాకు పండుగను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని బాలికలు గోరింటాకును వారి చేతులకు అందంగా అలంకరించుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు గీతాషాజు మాట్లాడుతూ స్త్రీలకు అత్యంత ఇష్టమైన గోరింటాకు పండగ జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ గోరింటాకులో ఆరోగ్యానికి కావలసిన ఔషధ లక్షణాలు ఉన్నాయని పిల్లలకు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Oplus_16908288
Oplus_16908288
మాంటిస్సోరిలో గోరింటాకు పండగను జరుపుకుంటున్న విద్యార్థినిలు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!