Social 1080×1350 • Multi-page
11-07-2025 BREAKING NEWS 07:53 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ లో ఘనంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు జన్మదిన వేడుకలు.

హుజురాబాద్ లో ఘనంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు జన్మదిన వేడుకలు.
IMG-20250711-WA0178

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న రెడ్డి జన్మదిన వేడుకలు శుక్రవారం హుజురాబాద్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో హుజురాబాద్ పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు యేముల పుష్పలత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసన్న రెడ్డి జన్మదిన కేక్ కట్ చేసి పంచి పెట్టారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షురాలు పుష్పలత మాట్లాడుతూ.. జిల్లా మహిళా అధ్యక్షురాలిగా కర్ర సత్యప్రసన్నరెడ్డి పార్టీకి, ప్రజలకు అందిస్తున్న సేవలను కొనియాడారు. ముఖ్యంగా మహిళా సాధికారత కోసం ఆమె చేస్తున్న కృషి అభినంద నీయమని అన్నారు. సత్య ప్రసన్నరెడ్డి ఆదర్శవంతమైన నాయకురాలు అని, ఆమె నాయకత్వంలో జిల్లాలో మహిళా కాంగ్రెస్ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మండల మహిళా అధ్యక్షురాలు పుల్ల రాధ కూడా జిల్లా అధ్యక్షురాలికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొల్లూరు కిరణ్, పట్టణ అధ్యక్షులు మేకల తిరుపతి, జిల్లా అధికార ప్రతినిధి సొల్లు బాబు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తోట రాజేంద్రప్రసాద్ సహా పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. వీరితో పాటు బ్లాక్ అధ్యక్షురాలు ఆలేటి సుశీల, జిల్లా ఉపాధ్యక్షురాళ్ళు లావణ్య, సొల్లు సునీత, మల్లీశ్వరి, అలాగే మిడిదొడ్డి రాజు, ఎర్ర రవీందర్, కోడెం నర్సింగ్, కిరణ్ రెడ్డి, రామకృష్ణ, రియాజ్, రాధ, కల్పన తదితర మంది కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

జిల్లా అధ్యక్షురాలు సత్య ప్రసన్న రెడ్డికి పుష్పగుచ్చాలు ఇచ్చే శుభాకాంక్షలు తెలుపుతున్న పట్టణ అధ్యక్షురాలు పుష్పలత..

హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జన్మదిన కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, కార్యకర్తలు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!