12-07-2025 NORMAL NEWS 07:19 PM
swarnodayam.com
Telugu Daily News
12-07-2025 07:19 PM By Mandala Yadagiri

పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కాంగ్రెస్ ఇంచార్జి ప్రణవ్ బాబు

పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కాంగ్రెస్ ఇంచార్జి ప్రణవ్ బాబు
IMG-20250712-WA0169

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వొడితల ప్రణవ్ బాబు శనివారం హుజురాబాద్ లోని పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇటీవల ఉద్యోగ పదవి విరమణ పొందిన కటుకూరి మల్లారెడ్డిని కలిసి ఘనంగా సన్మానించారు. ఉద్యోగ జీవితంలో చక్కగా విధులు నిర్వహించిన ఆయనను అభినందించారు. అనంతరం బోర్నపల్లి రోడ్ లో గల షాదీ ఖానాను సందర్శించారు. ఈ సందర్భంగా జామే మసీద్ ఈద్గా కబరస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు ఎండి ముజాహిద్ హుస్సేన్ ప్రణవ్ బాబుకు స్వాగతం పలికి షాదీ ఖానా పరిస్థితిని వివరించారు. షాది ఖానా అభివృద్ధికి కృషి చేయాలని కోరగా షాది ఖానా మౌలిక వసతుల కల్పన కోసం తన వంతు కృషి చేస్తానని ప్రణవ్ బాబు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ మహిళా అధ్యక్షురాలు యేముల పుష్పలత జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొని ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. పార్టీ అభివృద్ధి కోసం రాబోయే ఎన్నికల్లో విజయం సాధించడం కోసం ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రణవ్ బాబు వెంట పట్టణ అధ్యక్షులు మేకల తిరుపతి, అధికార ప్రతినిధి సొల్లు బాబు, వడ్లూరి విజయ్ కుమార్, ఆలేటి సుశీల, సొల్లు దశరథం, సందమల్ల బాబు, ఖాలిద్ హుస్సేన్, ఉప్పు శ్రీనివాస్, కిరణ్ రెడ్డి, ఎర్ర రవీందర్, మిడిదొడ్డి శ్రీనివాస్, కల్పన, కేఆర్ బిక్షపతి, అప్సర్, ముస్లిం నాయకులు హబీబ్ సాదిక్ అంజాత్ హర్షిత్ ఇర్ఫాన్ సలీం మీర్జా ఇమ్రాన్, ఎస్.కె ఫహీమ్, సోయల్, భాష తదితరులు పాల్గొన్నారు.

Oplus_16908288

పదవీ విరమణ పొందిన మల్లారెడ్డిని సత్కరిస్తున్న ప్రణవ్ బాబు..

షాదిఖానా చూసేందుకు వచ్చిన ప్రణవ్ బాబుకు పుష్పగుచ్చాలు ఇచ్చి శాలువాకప్పి స్వాగతం పలుకుతున్న కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్, నాయకులు..

అసంపూర్తిగా నిలిచిపోయిన షాదిఖాన గురించి వివరిస్తున్న కమిటీ అధ్యక్షుడు ముజాహిద్..

షాదిఖానా నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని వినతి పత్రం అందజేస్తున్న కమిటీ అధ్యక్షుడు, ముస్లిం నాయకులు..

———————–+++++++++—————-

&పత్రికా ప్రకటనలు (యాడ్స్)&

——————–+++++++++—————-

#వార్షికోత్సవ శుభాకాంక్షలు#

Oplus_16908288

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!