Social 1080×1350 • Multi-page
13-07-2025 BREAKING NEWS 01:33 PM
swarnodayam.com
Telugu Daily News

జాతీయ హాకీ క్రీడాకారిణిలకు ఘన సన్మానం.

జాతీయ హాకీ క్రీడాకారిణిలకు ఘన సన్మానం.
IMG-20250713-WA0041

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: జర్ఖండ్ లో జరిగిన జాతీయ జూనియర్ బాలికల హాకీ పోటీలలో పాల్గొన్న హుజురాబాద్ కు చెందిన క్రీడాకారిణులు తాళ్లపల్లి మేఘన, జంపాల శివ సంతోషినులకు హుజురాబాద్ హాకీ అసోసియేషన్ నాయకులు ఘనంగా సన్మానించారు. భవిష్యత్తులో మరింతగా క్రీడల్లో రాణించాలని ఈ సందర్భంగా పలువురు ఆకాంక్షించారు. క్రీడాకారినిలను సన్మానించిన వారిలో హాకీ క్లబ్ అధ్యక్షులు తోట రాజేంద్రప్రసాద్, కార్యదర్శి బోడిగె తిరుపతి, హాకీ క్లబ్ జిల్లా కార్యదర్శి బండ శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ తాళ్లపల్లి శ్రీనివాస్, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కే హరిప్రసాద్, వివిధ సంఘాల నాయకులు వేల్పుల రత్నం, కొత్తూరి రమేష్, శ్యామ్, డాక్టర్ ఐలయ్య, పరంకుషము కిరణ్ కుమార్, రమేష్ యాదవ్, కుడికల ప్రభాకర్, భాస్కర్, సాయి, సారయ్య గౌడ్, శేఖర్, మల్లయ్య, కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

జాతీయస్థాయి హాకీ పోటీలకు పాల్గొని ప్రతిభ కనబరిచిన క్రీడాకారునిలను శాలువాలతో సత్కరిస్తున్న ప్రజా ప్రతినిధులు, నాయకులు, వాకర్స్..

———————–+++++++++——————-

&పత్రికా ప్రకటనలు(యాడ్స్) &

——————–+++++++——————

#వార్షికోత్సవ శుభాకాంక్షలు#

Oplus_16908288

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!