13-07-2025 NORMAL NEWS 05:24 PM
swarnodayam.com
Telugu Daily News
13-07-2025 05:24 PM By Mandala Yadagiri

సామాజిక పింఛన్లను రూ. 6000కు పెంచాలీ… – ఎమ్మార్పీఎస్, విహెచ్పిఎస్ నాయకుల డిమాండ్

సామాజిక పింఛన్లను రూ. 6000కు పెంచాలీ… – ఎమ్మార్పీఎస్, విహెచ్పిఎస్ నాయకుల డిమాండ్
Oplus_16908288

– ఎమ్మార్పీ ఎస్, వికలాంగుల ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా సదస్సుకు హాజరుకానున్న పద్మశ్రీ మందకృష్ణ మాదిగ

మండల యాదగిరి స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
దివ్యాంగుల, వృద్ధుల, వితంతువుల మరియు ఒంటరి మహిళలకు అందించే సామాజిక పింఛన్లను రూ. 6000కు పెంచాలని డిమాండ్ చేస్తూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశానుసారం ఎమ్మార్పీఎస్, విహెచ్ పిఎస్ ఆధ్వర్యంలో హుజురాబాద్ మండల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి మంద రాజు మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వృద్ధుల, దివ్యాంగుల, వితంతువుల మరియు ఒంటరి మహిళల సామాజిక పింఛన్లను 6000 కు పెంచుతామని మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇంతవరకు వాటిని అమలు చేయలేదని కావున వెంటనే ముఖ్యమంత్రి పింఛన్లను పెంచాలని డిమాండ్ చేశారు. వీటి సాధన కోసం ఎమ్మార్పీఎస్ వికలాంగుల ఆధ్వర్యంలో జూలై 17న కరీంనగర్ లో జరిగే జిల్లా సదస్సుకు మందకృష్ణమాదిగ హాజరవుతున్నారని హుజురాబాద్ నియోజకవర్గం నుండి వేలాదిగా దివ్యాంగులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు బెజ్జంకి అనిల్, రాష్ట్ర నాయకులు మారేపల్లి శ్రీనివాస్, MEF జిల్లా కార్యదర్శి డాక్టర్ తడికమళ్ళ శేఖర్, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రొంటాల రాజ్ కుమార్, మండల ఇంచార్జ్ మొలుగూరి అశోక్, తాళ్లపల్లి అమరేందర్ గౌడ్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. విహెచ్ పీఎస్ హుజురాబాద్ మండల ఇన్ఛార్జ్ రాఘవుల శ్రీనివాస్, కో ఇన్ఛార్జ్ లు కంకణాల రవీందర్ రెడ్డి, మంతెన తిరుపతి, వితంతువుల ఇన్ఛార్జ్ గా దేవసాని ప్రియ దర్శిని, జమ్మికుంట మండల ఇన్చార్జిగా మ్యాతల రంగయ్య, శనిగరపు రమేష్, సైదాపూర్ మండల ఇన్చార్జిగా జుక్కోడ్ భిక్షపతి, అంబాల తిరుపతి, వీణవంక పైడిమల్ల శ్రీనివాస్, సిర్సేడు చేరాల వైకుంఠం తదితర నాయకులు పాల్గొన్నారు.

మండల సన్నాహక సమావేశంలో మాట్లాడుతున్న ఎంఆర్పిఎస్ నాయకులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!