13-07-2025 NORMAL NEWS 06:46 PM
swarnodayam.com
Telugu Daily News
13-07-2025 06:46 PM By Mandala Yadagiri

బీజేపీతో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నది కాంగ్రెస్ పార్టీ… సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయం! – జమ్మికుంట BRSV టౌన్ ప్రెసిడెంట్ కొమ్ము నరేష్

బీజేపీతో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నది కాంగ్రెస్ పార్టీ… సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయం! – జమ్మికుంట BRSV టౌన్ ప్రెసిడెంట్ కొమ్ము నరేష్
IMG-20250713-WA0055(1)

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (జమ్మికుంట):బీజేపీతో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నది కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయం అని జమ్మికుంట BRSV టౌన్ ప్రెసిడెంట్ కొమ్ము నరేష్ ఆదివారం విలేకరుల సమక్షంలో ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో బీజేపీతో కలిసి పోతున్న దాఖలాలు ఎక్కడ చూస్తున్నా కనిపిస్తున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అయిన సీఎం రేవంత్ రెడ్డి బీజేపీతో అవినాభావ సంబంధాలు పెంచుకుంటూ పార్టీ పరువు ప్రతిష్టను కూడా తాకట్టు పెట్టాడన్నారు. త్వరలోనే బీజేపీలోకి రేవంత్ జంప్ చేసేది ఖాయం అన్నది రాజకీయ వర్గాల్లో బలమైన చర్చగా మారిందనీ ఇది కనిపించే నిజం అని ఆయన అన్నారు.

వొడితల ప్రణవ్… ఒక రోజు నువ్వు BRS పార్టీలో చేరి మా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నాయకత్వంలో పనిచేసే రోజు రాబోతుంది, ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది.! అని ఆయన పేర్కొన్నారు. నీకు కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాదు, మీ కాంగ్రెస్ చేసిన సర్వేలలో 3rd ప్లేస్ లో ఉన్నావు నువ్వు గెలువవు మీ తాతలే గెలువలేకపోయారు అని పేర్కొన్నారు.

మొదట నీ కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గతి చూసుకో!

పదేపదే బీఆర్ఎస్ పార్టీని విమర్శించే ముందు, మీరు చూసుకోవలసింది మీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పరిస్థితి అని, అసలు ఆయనే రేపటికి బీజేపీలో చేరుతున్నారని అంటున్నారనీ ఆయన ఆరోపించారు. మా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై విమర్శలు చేస్తే నీవు పెద్దవాడివి కాలేవనీ అన్నాడు. హుజురాబాద్ లో నీవు ఎక్కడైనా ప్రజలకు సేవ చేశావా? 10 కోట్లు హుజురాబాద్ గ్రౌండ్ కి కౌశిక్ రెడ్డి తీసుకొస్తే నువ్వు దాన్ని అపి శునకానందం పొందుతూ హుజురాబాద్ ప్రజలను ఇబ్బంది పెడ్తున్నావు అని పేర్కొన్నారు.

అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంపీ ప్రోటోకాల్ ప్రకారం పిలుస్తారు – నీకు ఇది కూడా తెలియదా? అన్నారు. సర్కారు అధికారిక కార్యక్రమాల్లో ఎంపీ, ఎమ్మెల్యేలను ప్రోటోకాల్ ప్రకారం అధికారులు పిలవడం జరుగుతుందనీ, ఇది రాజకీయ జ్ఞానం ఉన్నవారికి తెలిసిన విషయమే కానీ నీకు ఇది కూడా తెలియకపోవడం నీ అజ్ఞానానికి నిదర్శనం అని కొమ్ము నరేష్ పేర్కొన్నారు.

విలేకరులతో మాట్లాడుతున్న జమ్మికుంట BRSV టౌన్ ప్రెసిడెంట్ కొమ్ము నరేష్

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!