13-07-2025 NORMAL NEWS 07:02 PM
swarnodayam.com
Telugu Daily News
13-07-2025 07:02 PM By Mandala Yadagiri

అ’పూర్వ’ సమ్మేళనం… – భావోద్వేగాల మధ్య పూర్వ విద్యార్థుల కలయిక

అ’పూర్వ’ సమ్మేళనం… – భావోద్వేగాల మధ్య పూర్వ విద్యార్థుల కలయిక
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : సరిగ్గా 21 ఏళ్ల క్రితం విడిపోయిన స్నేహితులు ఒక్కసారిగా అంతా ఒక వేదికపై కలవడంతో వారి భావోద్వేగాలకు అంతులేకుండా పోయింది. ఒకరినొకరు ‘అరేయ్’ అంటూ ఆప్యాయంగా పలకరించుకుంటూ మరోసారి ఒకరినొకరు పరిచయం చేసుకున్న సంఘటన ఆదివారం స్థానిక సాయి కన్వెన్షన్ హాల్ లో జరిగింది. వివరాల్లోకెళ్తే హుజురాబాద్ లోని కాకతీయ పాఠశాలలో 2003-04 లో పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు మరోసారి కలవడానికి నిశ్చయించుకున్నారు. 20 సంవత్సరాల తర్వాత ఒకరినొకరు చూస్తూ ఆనందంతోపాటు ఆశ్చర్యంలో మునిగిపోయారు. చాలా సంవత్సరాలుగా విడిపోయిన స్నేహితులతో పాటు వారికి విద్యాబుద్ధులు నేర్పిన గురువుల సైతం కలిసి తమ జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఒక్కొక్కరిగా పరిచయం చేసుకుంటూ తాము ప్రస్తుతం ఉన్న హోదాలను చెప్పుకుంటూ వచ్చారు. అనంతరం వాళ్లంతా కలిసి చేసిన సందడి చూస్తే వాళ్ళ వయసును మర్చిపోయి మళ్లీ పాతికేల్ల క్రితం ఎలా అయితే ఆకతాయిగా ఉన్నారో అదే తరహాలో ఎంజాయ్ చేశారు. గతంలో జరిగిన సంఘటనన్ని నెమరు వేసుకుంటూ ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటూ కాలక్షేపం చేశారు. అప్పటి విద్యార్థుల మాదిరిగానే ఇప్పుడు గురువులు చెప్పే విషయాలను కూడా అంతే శ్రద్ధగా విన్నారు. గురువుల కంటే పై హోదాలో ఉన్న శిష్యులను చూసి ఆ గురువులు మురిసిపోయారు. ఎంత ఎదిగిన ఒదిగి ఉన్నట్లే విద్యార్థులు కూడా గురువులకు ఆ గౌరవం ఇచ్చారు. మరోసారి వారి వద్ద ఆశీస్సులు తీసుకున్నారు. అంతా సందడి మధ్యన సాయంత్రం అయిపోయింది. ఇక స్నేహితులు ఒకరికొకరు సెలవు చెప్పుకునే సమయం మొదలైంది అంతే బరువెక్కిన గుండెలతో ఒకరినొకరు గట్టిగా హత్తుకొని ఒకవైపు సంతోషాన్ని మరోవైపు భావోద్వేగంతో పయనమయ్యారు. చివరిగా వాళ్ల ముఖాల్లో ఒకే ఒక సంతోషం ఎందుకంటే ఇక మీద ఎవరి కుటుంబంలోనైనా శుభకార్యం జరిగితే మళ్లీ అంతా కలిసి వెళ్లాలని వారు ఈరోజు కుదుర్చుకున్న ఒప్పందమే ఆ సంతోషానికి కారణమైంది. విద్యార్థులు అరవింద్, గౌతం, శ్రీనివాస్, వెంకటేష్, విజ్ఞాన్, అశోక్ ల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో టీచర్లు రాజయ్య, ప్రతాపరెడ్డి, వేణుగోపాల్, మండల వెంకటేశ్వర్లు, పున్నం చందర్ లతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.

2003 – 2004 కాకతీయ పూర్వ విద్యార్థుల కలయిక..

——————++++++———————

&పత్రికా ప్రకటనలు (యాడ్) &

——————+++++++++——————-

#వార్షికోత్సవ శుభాకాంక్షలు#

Oplus_16908288

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!