Social 1080×1350 • Multi-page
13-07-2025 BREAKING NEWS 07:35 PM
swarnodayam.com
Telugu Daily News

కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలి. -సిఐటియు జిల్లా కార్యదర్శి కొప్పుల శంకర్

కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలి. -సిఐటియు జిల్లా కార్యదర్శి కొప్పుల శంకర్
IMG-20250713-WA0073

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కొప్పుల శంకర్ అన్నారు. ఆదివారం హుజురాబాద్ లో సిఐటియు కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ…
మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలనీ, పంచాయతీ కార్మికుల కనీస వేతనం 26 వేల రూపాయలు చెల్లించాలని అన్నారు.
పంచాయతీ కార్మికుల ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనం 26,000 చెల్లించాలని, మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనేక సంవత్సరంల నుండి పోరాడుతున్న కార్మికులకు, ప్రభుత్వం గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు, కార్మికుల అకౌంట్లోకి నేరుగా చెల్లిస్తానని మాట ఇచ్చి, ఇప్పటికీ అమలు చేయడం లేదన్నారు. కార్మికులకు పిఎఫ్, ఈఎస్ఐ ప్రమాద బీమా, సౌకర్యాలు కల్పించాలని, ఆన్లైన్లో పేర్లు నమోదు లేని కార్మికులకు సమాన వేతనం ఇవ్వాలని నమోదు చేయాలని, గతంలో కార్మికులకు ఇచ్చిన జీవోలను అమలు చేయాలని, అర్హులైన కార్మికులందరికీ స్పెషల్ స్టేటస్ హోదా కల్పించాలని, కాలయాపన చేయకుండా కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చి వారి సమస్యలు పరిష్కరించాలని లేనట్లయితే పంచాయతీ కార్మికులను గ్రామస్థాయిలో ఐక్యం చేసి మరో సమ్మె పోరాటానికి సన్నద్ధం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు శనిగరపు కొమురయ్య , జిల్లా సహాయ కార్యదర్శి మహంకాళి కొమురయ్య, మండల నాయకులు, తునికి సుధాకర్, లింగయ్య, మొగిలి, ఉమ్మడి శ్రీకాంత్, రాజు, మనక్క, సంపత్, నరేష్, నితిన్, అవినాష్ తదితరులు పాల్గొన్నారు.

సమావేశంల మాట్లాడుతున్న సిఐటియు జిల్లా కార్యదర్శి కొప్పుల శంకర్..
సిఐటియు నాయకులు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న శంకర్..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!