Social 1080×1350 • Multi-page
14-07-2025 BREAKING NEWS 05:17 PM
swarnodayam.com
Telugu Daily News

దిలీప్ ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోలేదన్న ఆక్కసుతోనే విమర్శలు…కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు సందమల్ల నరేష్

దిలీప్ ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోలేదన్న ఆక్కసుతోనే విమర్శలు…కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు సందమల్ల నరేష్
IMG-20250714-WA0053

– దిలీప్ ఒక బ్లాక్మెయిలర్,అక్రమ దందాలకు కేరాఫ్ అడ్రస్

– కౌశిక్ రెడ్డి బిజెపి నాయకులతో టచ్ లో ఉన్నది నిజం కాదా?

– కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు సందమల్ల నరేష్

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: బిఆర్ఎస్ పార్టీ నాయకుడు దిలీప్ ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోలేదనే అక్కసుతోనే ప్రణవ్ బాబుపై విమర్శలు చేస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు సందమల్ల నరేష్ ఆరోపించారు. సోమవారం హుజురాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొలుగు దిలీప్ ఒక బ్లాక్మెయిలరని అక్రమ దందాలకు కేరాఫ్ అడ్రస్ గా, చెల్లెలి కౌన్సిలర్ పదవిని అడ్డం పెట్టుకొని అక్రమ దందాలు చేసే దిలీప్ కు ప్రణవ్ బాబుని విమర్శించే నైతికస్థాయి లేదని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హుజురాబాద్ ప్రజలను బ్లాక్ మెయిల్ చేసి, సెంటిమెంట్ తో గెలిస్తే, బ్లాక్మెయిల్ నాయకుడికి బ్లాక్మెయిల్ శిష్యులే ఉంటారని మరోసారి రుజువు చేశారన్నారు. ఇదే దిలీప్ పార్లమెంటు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమైతే ఇతని ప్రవర్తన వలన తిరస్కరించారని, జమ్మికుంట అంగడి టెండర్ రూపంలో 30 లక్షల 3వేల రూపాయల ప్రభుత్వ సొమ్మును కాజేస్తే ఓ.ఎస్ నెంబర్ 59/2017 కింద దిలీప్ పై కేసు నమోదు చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు? ప్రణవ్ ఎవరిని చూసి రాజకీయం నేర్చుకోవాల్సిన అవసరం లేదని, రాజకీయంలో పుట్టిందే వారీ ఇంట్లో అని అది మర్చిపోకూడదని గుర్తు చేశారు. పాడి కౌశిక్ రెడ్డి అనుచరులు చిల్లర మాటలు, అస్యత ఆరోపణలు, అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఉరీకించి కొడతామని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ దుబాసి బాబు, సీనియర్ నాయకులు సందమల్ల బాబు, బత్తిని రవీందర్ గౌడ్, బండ నవీన్, ముక్క రవితేజ, కె.ఆర్.బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

Oplus_16908288

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు సందమల్ల నరేష్, పక్కన నాయకులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!