Social 1080×1350 • Multi-page
14-07-2025 BREAKING NEWS 09:31 PM
swarnodayam.com
Telugu Daily News

ఎంఈఓ ఏకపక్ష నిర్ణయాలతో ఉపాధ్యాయుల ఇబ్బందులు… – డిటిఎఫ్ నాయకుల ఆరోపణ

ఎంఈఓ ఏకపక్ష నిర్ణయాలతో ఉపాధ్యాయుల ఇబ్బందులు… – డిటిఎఫ్ నాయకుల ఆరోపణ
IMG-20250714-WA0088

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలంలో ఉపాధ్యాయుల సర్దుబాటు విషయంలో మండల విద్యాధికారి శ్రీనివాస్ ఏకపక్ష నిర్ణయంతో ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారని వెంటనే అతనిపై చర్య తీసుకోవాలని హుజురాబాద్ మండల డిటిఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. వారు సోమవారం మాట్లాడుతూ…ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న పాఠశాలల నుండి ఉపాధ్యాయులను వేరే పాఠశాలలో సర్దుబాటు చేయడం, తక్కువ మంది విద్యార్థులు ఉన్న పాఠశాలల నుండి ఉపాధ్యాయులను తీయకపోవడం, సీనియారిటీని పరిగణనలోకి తీసుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా ఏకపక్ష నిర్ణయంతో ఉపాధ్యాయులను సర్దుబాటు చేయడం సరికాదన్నారు. నిబంధనలకు అనుగుణంగా సీనియార్టీ ప్రాతిపదికన ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి ఉత్తర్వులు లేకుండా ఎంఈఓ కార్యాలయంలో SA గణితం ఉపాధ్యాయునితో పని చేయించుకుంటున్నారని, ఈ విషయంపై ఎంఈఓ శ్రీనివాస్ పొంతనలేని సమాధానం చెబుతూ విషయాన్ని దాట వేస్తున్నాడని ఆరోపించారు. ఎంఈఓ శ్రీనివాస్ చేస్తున్న ఏకపక్ష నిర్ణయాలపై జిల్లా అధికారులు విచారణ జరిపి శాఖపరమైన చర్య తీసుకోవాలని DTF హుజురాబాద్ జోన్ కన్వీనర్ శ్రీరామ్ చక్రధర్, మండల శాఖ అధ్యక్షులు బండ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి బేతి తిరుపతిరెడ్డి, ఉపాధ్యక్షులు కనకం వెంకటస్వామి, జిల్లా కౌన్సిలర్ అల్లి శ్రీనివాస్ లు డిమాండ్ చేశారు.

ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్న ఎంఈఓ కార్యాలయం…

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!