15-07-2025 NORMAL NEWS 07:58 PM
swarnodayam.com
Telugu Daily News
15-07-2025 07:58 PM By Mandala Yadagiri

స్థానిక సంస్థల ఎన్నికల బరిలో సిపిఐ.. – డబల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలి.

స్థానిక సంస్థల ఎన్నికల బరిలో సిపిఐ.. – డబల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలి.
IMG-20250715-WA0098

సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో భారత కమ్యూనిస్టు పార్టీ అన్ని స్థానాల్లో పోటీకి సిద్ధంగా ఉందని, ఎన్నికల బరిలో నిలిచేందుకు సిపిఐ శ్రేణులు సిద్ధం కావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ పిలుపునిచ్చారు.

మంగళవారం జమ్మికుంటలో ఏర్పాటుచేసిన పత్రిక విలేకరుల సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడుతూ త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో సిపిఐ పోటీ చేస్తుందని తెలిపారు. అందులో భాగంగానే మండలాల వారిగా పార్టీ అంతర్గత సమావేశాలు నిర్వహించుకుంటూ కార్యాచరణను రూపొందించుకుంటూ ముందుకు వెళ్తామని స్థానిక సంస్థలు ఎన్నికల్లో గెలిపిదేయంగా ఎన్నికల బరిలో నిలుస్తామని హుజురాబాద్ నియోజకవర్గంలో ఎంపిటిసి, జడ్పిటిసి స్థానాలకు పోటీ చేస్తామని ఎందుకు అనుగుణంగా క్యాడర్ను సన్నద్ధం చేస్తున్నామని ఆయన తెలియజేశారు.

గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించినటువంటి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నేటికీ అర్హులకు పంపిణీ చేయకపోవడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కోట్ల రూపాయలు వెచ్చించి డబుల్ బెడ్ రూమ్ నిర్మించి పేదలకు పంచకపోవడంతో అవి శిథిలావస్థకు చేరుకుంటున్నాయని అదేవిధంగా అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారుతున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తుందని అటు బిఆర్ఎస్ ప్రభుత్వం ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయకపోవడం పేదల పట్ల ఆ పార్టీలకు ఎంత ప్రేమ ఉందో తెలియజేస్తుందని అన్నారు. తక్షణమే జమ్మికుంట మండలంలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ లో ఇండ్లను పంపిణీ చేయాలని లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో ఆ డబుల్ బెడ్ రూమ్లో ఇండ్ల ఆక్రమించుకొని అర్హులైన వారందరికీ సిపిఐ ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం చేపడతామని ఆయన హెచ్చరించారు.
విలేకరుల సమావేశంలో జమ్మికుంట, ఇల్లందకుంట సిపిఐ మండల కార్యదర్శిలు గజ్జి ఐలయ్య, మాదారపు రత్నాకర్ నాయకులు బొజ్జం రామ్ రెడ్డి, సారయ్య, శంకర్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!