Social 1080×1350 • Multi-page
15-07-2025 BREAKING NEWS 10:06 PM
swarnodayam.com
Telugu Daily News

కాంగ్రెస్ సేవాదళ్ నియోజకవర్గం అధ్యక్షుడు నరెడ్ల వినోద్ రెడ్డి మాతృమూర్తి వియోగం.. – రేపు మధ్యాహ్నం స్వగ్రామంలో అంత్యక్రియలు.

కాంగ్రెస్ సేవాదళ్ నియోజకవర్గం అధ్యక్షుడు నరెడ్ల వినోద్ రెడ్డి మాతృమూర్తి వియోగం.. – రేపు మధ్యాహ్నం స్వగ్రామంలో అంత్యక్రియలు.
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలం పెద్ద పాపయ్య పల్లె గ్రామానికి చెందిన కాంగ్రెస్ సేవాదళ్ హుజూరాబాద్ నియోజకవర్గం అధ్యక్షుడు నరేడ్ల వినోద్ రెడ్డి మాతృమూర్తి నరేడ్ల సరోజన ఈరోజు సాయంత్రం శివైక్యం చెందారు. అనారోగ్యంతో హన్మకొండ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందింది. ఆమె కుటుంబ సభ్యులు ఆమె మృతదేహాన్ని హన్మకొండ నుండి స్వగ్రామం పెద్దపాపయ్యపల్లికి తరలించారు. అయితే ఆమె పెద్ద కుమారుడు వినోద్ రెడ్డి కాగా చిన్న కుమారుడు చైతన్య రెడ్డి బీజేవైఎం హుజురాబాద్ మండల అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆమెకు భర్త సాంబశివరెడ్డి ఉన్నారు. సరోజన అంత్యక్రియలు బుధవారం మధ్యాహ్నం 12 గంటలకి నిర్వహించడం జరుగుతుందని ఆమె కుటుంబ సభ్యులు గ్రామస్తులు తెలిపారు. ఆమె మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వోడితెల ప్రణవ్, పిసిసి సభ్యుడు పత్తి కృష్ణారెడ్డి, వివిధ మండలాల, పట్టణాలకు చెందిన కాంగ్రెస్ బిజెపి నాయకులు, కార్యకర్తలు వారి కుటుంబ సభ్యులకు సంతాపములు తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనో ధైర్యాన్ని ప్రసాదించమని కోరుకుంటున్నట్లు వేర్వేరు ప్రకటనలో పేర్కొన్నారు.

చికిత్స పొందుతూ మృతి చెందిన నరెడ్ల రోజన (ఫైల్)

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!