16-07-2025 NORMAL NEWS 09:41 PM
swarnodayam.com
Telugu Daily News
16-07-2025 09:41 PM By Mandala Yadagiri

తెలంగాణ జనసమితి పార్టీ సైదాపూర్ మండల అధ్యక్షునిగా మొలుగూరి శ్రీనివాస్ నియామకం

తెలంగాణ జనసమితి పార్టీ సైదాపూర్ మండల అధ్యక్షునిగా మొలుగూరి శ్రీనివాస్ నియామకం
IMG-20250716-WA0058

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (సైదాపూర్): తెలంగాణ జనసమితి పార్టీ సైదాపూర్ మండల అధ్యక్షునిగా వెన్నంపల్లి గ్రామానికి చెందిన మొలుగూరి శ్రీనివాస్ ని నియమించినట్లు టీజేఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మోరే గణేష్ నియామక పత్రం అందజేశారు. తెలంగాణ జనసమితి విద్యార్థి, యువజన విభాగంలో పలు పదవుల్లో కొనసాగుతూ పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్న మొలుగూరి శ్రీనివాస్ కి అవకాశం కల్పించవలసిందింగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్కెర రాజు సూచనతో ఎమ్మెల్సీ,టీజేఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కోదండరాం ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగిందని టీజేఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మోరే గణేష్ తెలిపారు. ఈ సందర్బంగా మొలుగూరి శ్రీనివాస్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో నాకు మండల పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్కెర రాజుకి, మహిళా విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరికిల్ల స్రవంతి, జిల్లా అధ్యక్షులు మోరే గణేష్, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు అరికిల్ల భానుచందర్ లకు కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణ జనసమితి పార్టీ సైదాపూర్ మండల అధ్యక్షునిగా మొలుగూరి శ్రీనివాస్ కు నియామక పత్రం అందజేస్తున్న టీజేఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మోరే గణేష్ తదితర నాయకులు..

————————+++++++++———————

@పత్రికా ప్రకటనలు (యాడ్స్)@

——————-+++++++++————————-

&వార్షికోత్సవ శుభాకాంక్షలు&

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!