Social 1080×1350 • Multi-page
16-07-2025 BREAKING NEWS 10:28 PM
swarnodayam.com
Telugu Daily News

బిజెపి పార్టీ వారివి తప్పుడు ఆరోపణలు. — కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ ప్రధాన కార్యదర్శి సందమల్ల బాబు

బిజెపి పార్టీ వారివి తప్పుడు ఆరోపణలు. — కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ ప్రధాన కార్యదర్శి సందమల్ల బాబు
Oplus_16908288

– రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నడు గుర్తుకు రానీ సమస్యలు బిజెపి వాళ్ళకి ఇప్పుడు గుర్తుకు వస్తున్నాయి

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ అంబేద్కర్ భవన నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా అడ్డుపడ్డ దాకాలు లేవనీ, హుజురాబాద్ నియోజకవర్గంలో గతంలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగిన పొన్నం ప్రభాకర్ తన ఎంపీ నిధుల నుండి ఎన్నో అంబేద్కర్ భవనాలు నిర్మించిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ ప్రధాన కార్యదర్శి సందమల్ల బాబు పేర్కొన్నారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..

మీకు చిత్తశుద్ధి ఉంటే అంబేద్కర్ భవన నిర్మాణానికి రెండు సార్లు కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా మరియు ఇప్పుడు కేంద్ర మంత్రిగా కొనసాగుతున్న బండి సంజయ్ తో బిజెపి జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి నిధులు మంజూరు చేయించండి అని అన్నారు. దళిత బంధు విషయంలో కూడా తప్పుడు ఆరోపణలు దళిత బందును ఎన్నికల సందర్భంగా ఎన్నికలలో లబ్ధి పొందడం కొరకు అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం దళిత బందును నిలిపివేయడం జరిగిందని, మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత దళిత బంధు లబ్ధిదారులకు అన్యాయం జరగవద్దని ప్రతి లబ్ధిదారుడికి న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ పెద్దలతో, మంత్రులతో సంప్రదింపులు జరిపి రెండో విడత నిధులు వచ్చే విధంగా హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడితల ప్రణవ్ బాబు కృషి చేశారన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరలో ఉన్నందున ఆ ఎన్నికల్లో లబ్ది పొందడం కొరకు ఎప్పుడు ఎన్నడూ గుర్తుకురానటువంటి సమస్యలు ఇప్పుడు బిజెపి వాళ్లకి గుర్తుకు రావడం హాస్యాస్పందంగా ఉందని చందమల్ల బాబు ఆరోపించారు. హుజురాబాద్ అంబేద్కర్ భవన నిర్మాణం విషయంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉందనీ, హుజురాబాద్ అంబేద్కర్ భవన నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా అడ్డుపడలేదనీ, అడ్డుపడ్డ దాకాలు కూడా లేవుఅని, బిజెపి పార్టీ వారివి తప్పుడు ఆరోపణలు అన్నారు. హుజురాబాద్ అంబేద్కర్ భవన నిర్మాణానికి గతంలో కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా ఉన్న పొన్నం ప్రభాకర్ హుజురాబాద్ నగర పంచాయతీ గా ఉన్నప్పుడే అంబేద్కర్ భవన నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని, ఆ తర్వాత బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఈటల రాజేందర్ అంబేద్కర్ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం జరిగిందని గుర్తు చేశారు. అంబేద్కర్ భవన నిర్మాణానికి టెండర్ ద్వారా పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ అంబేద్కర్ భవన నిర్మాణాన్ని మొదలుపెట్టి మధ్యలోనే ఏవో కారణాల వలన నిర్మాణ పనులు చేయలేక మధ్యలోనే వదిలేసి వెళ్లడం జరిగిందన్నారు. ఈ సమస్య అధికారుల పరిధిలో ఉందనీ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో లబ్ధి పొందడం కొరకు బిజెపి వాళ్లు పూర్తి విషయం తెలుసుకోకుండా అబద్ధపు ప్రచారాలు చేస్తూ ఎన్నడూ కూడా నియోజకవర్గంలోని సమస్యలు పట్టించుకోకుండా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని అంబేద్కర్ భవనం గుర్తుకు వచ్చిందన్నారు. కేంద్ర మంత్రి బండి ఏనాడన్న హుజురాబాద్ అంబేద్కర్ భవనానికి నిధులు మంజూరు చేశాడా… ఒకసారి మీరు చెప్పాలి అని బాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ దుబాసి బాబు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బత్తిని రవీందర్ గౌడ్, ముక్క రవితేజ తదితరులు పాల్గొన్నారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ ప్రధాన కార్యదర్శి సందమల్ల బాబు

————————–++++++++++———————-

#పత్రికా ప్రకటనలు (యాడ్స్)#

——————-++++++++————————-

&వార్షికోత్సవ శుభాకాంక్షలు&

——————-+++++++++———————

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!