Social 1080×1350 • Multi-page
16-07-2025 BREAKING NEWS 11:33 PM
swarnodayam.com
Telugu Daily News

కాట్రపల్లిలో వరుణ దేవుడి కోసం గ్రామ దేవతలకు జలాభిషేకం

కాట్రపల్లిలో వరుణ దేవుడి కోసం గ్రామ దేవతలకు జలాభిషేకం
IMG_20250716_233032

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ జూలై16 : వర్షాభావ పరిస్థితులతో అల్లాడుతున్న కాట్రపల్లి గ్రామ ప్రజలు వరుణ దేవుడి కరుణ కోసం గ్రామ దేవతలకు ఘనంగా జలాభిషేకం నిర్వహించారు. ఎండిపోతున్న పంటలను కాపాడాలని, పాడి పశువులు సమృద్ధిగా వృద్ధి చెందాలని కోరుతూ గ్రామస్తులంతా ఏకమై ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని చేపట్టారు.
వేసవి కాలాన్ని తలపించేలా ఉన్న ప్రస్తుత వర్షాకాల పరిస్థితులతో రైతులు, గ్రామ ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో భగవంతునిపై విశ్వాసంతో, తమ గ్రామ దేవతలైన హనుమాన్ దేవాలయం, సీతారామచంద్ర వారి దేవాలయం, శివాలయం, భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రాయి, పోచమ్మ తల్లి దేవాలయం, ఎల్లమ్మ తల్లి దేవాలయం, నాగేంద్రస్వామి దేవాలయం, కట్ట మైసమ్మ, గడి మైసమ్మ, దుర్గమ్మ తల్లి దేవాలయాల్లో ప్రత్యేక జలాభిషేకాలు నిర్వహించారు. గ్రామస్థులు తమ చేతులతో బిందెల కొద్దీ నీటిని తెచ్చి గుళ్లలోని దేవతా విగ్రహాలపై పోస్తూ, వానలు కురవాలని మనస్ఫూర్తిగా ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి రావుల అనిత వెంకట్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పెరుమాండ్ల బిక్షపతి, కాసగొని కిరణ్, బాణాల కుమార్, బొల్లా చంద్రమౌళి, రావుల సురేందర్, ముప్పు సహదేవ్ తదితరులు పాల్గొన్నారు. తమ గ్రామానికి వర్షాలు కురిసి, పంటలు పండి, పశు సంపద వృద్ధి చెందాలని గ్రామ ప్రజలంతా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ జలాభిషేకంతో వరుణ దేవుడు కరుణిస్తాడని గ్రామ ప్రజలు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు.

Oplus_16908288

బిందెలతో తరలివెళ్ళి జలాభిషేకం చేస్తున్న గ్రామస్తులు..

Oplus_16908288

గ్రామ దేవతలకు జలాభిషేకం చేస్తున్న కాట్రపల్లి గ్రామస్తులు…

ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేస్తున్న కాట్రపల్లి గ్రామస్తులు

—————————-++++++++——————-

@పత్రికా ప్రకటనలు (యాడ్స్)@

———————++++++++———————

#వార్షికోత్సవ శుభాకాంక్షలు#

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!