Social 1080×1350 • Multi-page
17-07-2025 BREAKING NEWS 07:35 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ బాలికోన్నత పాఠశాల భవన నిర్మాణానికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రికి విజ్ఞప్తి.

హుజురాబాద్ బాలికోన్నత పాఠశాల భవన నిర్మాణానికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రికి విజ్ఞప్తి.
IMG-20250717-WA0147

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఐదు దశాబ్దాల క్రితం నిర్మించిన హుజురాబాద్ పట్టణంలోని బాలికోన్నత పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థలో ఉందని, పాఠశాల నిర్వహణ కోసం నూతన భవనాన్ని నిర్మించేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ను కలిసి పాఠశాల ప్రధానోపాధ్యాయిని బొరగాల తిరుమల, ఉపాధ్యాయిలు పల్కల ఈశ్వర్ రెడ్డి,ఆసియా లు విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు. గురువారం హుజురాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో పదవ తరగతి చదువుతున్న బాలబాలికలకు మంత్రి సైకిళ్లను పంపిణీ చేసారు. ఈ సందర్బంగా మంత్రిని కలిసిన బాలికోన్నత పాఠాశాల ప్రధానోపాధ్యాయురాలు తిరుమల తన సిబ్బందితో మంత్రిని కలిసి హుజురాబాద్ పట్టణంలో 75 ఏళ్ల క్రితం ఏర్పాటైన బాలికల పాఠశాల నిర్వాహణ కోసం యాభై ఏళ్ళ క్రితం నిర్మించిన గదులు పూర్తిగా శిథిలావస్థలో ఉండి, వర్షాకాలంలో, ఎండాకాలంలో విద్యార్థినిలతో పాటు ఉపాధ్యాయులు, సిబ్బంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాగే ప్రస్తుత పాఠశాలలో బాలికలతో పాటు బాలురు కూడా చదువుకుంటున్నారని, అందువల్ల పాఠశాల కోసం తక్షణం ఆరు నూతన గదులను నిర్మించవలసిన అవసరం ఉందని మంత్రికి వివరించారు. వీరు చేసిన విజ్ఞాపనకు మంత్రి సానుకూలంగా స్పందించారు.


———————–+++++++++——————

&పత్రికా ప్రకటనలు (యాడ్స్)&

——————++++++++———————-

##వార్షికోత్సవ శుభాకాంక్షలు##

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!