Social 1080×1350 • Multi-page
17-07-2025 BREAKING NEWS 09:46 PM
swarnodayam.com
Telugu Daily News

బండి పర్యటన రోజే భగ్గుమన్న బిజెపి వర్గ విభేదాలు!… ఒక వర్గంగా చిత్రీకరించి సమాచారం ఇవ్వడం లేదని బిజెపి అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ పదవికి, పార్టీకి రాజీనామా.

బండి పర్యటన రోజే భగ్గుమన్న బిజెపి వర్గ విభేదాలు!… ఒక వర్గంగా చిత్రీకరించి సమాచారం ఇవ్వడం లేదని బిజెపి అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ పదవికి, పార్టీకి రాజీనామా.
IMG_20250717_213853

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పర్యటన రోజే బిజెపిలో వర్గపోరు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఏకంగా బిజెపి నియోజకవర్గ కన్వీనర్ తన పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం హుజురాబాద్ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. దానికి సంబంధించిన వివరాలు బాధితుడు పంపిన లేక సారాంశం ఈ విధంగా ఉంది.

మాడ గౌతంరెడ్డి అనే నేను 2022 నుండి భారతీయ జనతా పార్టీలో క్రియాశీల కార్యకర్తగా, హుజురాబాద్, అసెంబ్లీ కన్వీనర్ గా భాధ్యతలు నిర్వహిస్తూ, పార్టీ అప్పగించిన కార్యక్రమాలను అందరి నాయకులు, కార్యకర్తల సహయంతో విజయవంతంగా నిర్వహించడం జరిగింది. కానీ ప్రస్తుత పరిస్థితులలో, భారతీయ జనతా పార్టీలో, నెలకొన్న అంతర్గత పోరు, ఆధిపత్య పోరు, ఈటెల రాజేందర్ వర్గాన్ని ఒక ప్రణాళికా ప్రకారంగా అవమానాలకు గురిచేస్తు, అణచి వేస్తున్న తీరుతో, కలత చెంది ఈ పార్టీలో కోనసాగలేనని భావించి, నాకు ఇచ్చిన అసెంబ్లీ కన్వీనర్ పదవికి, భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వానీకి రాజీనామా చేస్తున్నాను.

ఇట్లు
మాడ గౌతంరెడ్డి.
హుజురాబాద్ అసెంబ్లీ కన్వీనర్
8639612426


అనీ ఈ విధంగా లెటర్ రాసి రాజీనామా చేయడం ఆ పార్టీ వర్గాలలో కలకాలం సృష్టించింది. అయితే కేంద్ర మంత్రి బండి సంజయ్ హుజురాబాద్ కు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మరి బండి మరి ఎవరి పేర్లు చెప్పి వర్గం అంటే సహించేది లేదని పేర్లు చెబితే వర్గం చెబితే రానున్న స్థానిక ఎన్నికల్లో టికెట్లు రావని పార్టీ కోసం పనిచేసే వారికి మోడీ నాయకత్వాన్ని పనిచేసే వారికి మాత్రమే గుర్తింపు ఉంటుందని హెచ్చరించడంతో పార్టీలోనీ కీలక వ్యక్తి వర్గపోరు ఉన్నట్లు పేర్కొంటూ పదవికి రాజీనామా చేయడం ఈటెల – బండి ఇద్దరి మధ్యన విభేదాలు ఉన్నట్లు తేటతెల్లమైంది. ఏది ఏమైనప్పటికీ బండి సంజయ్ హుజురాబాద్ పర్యటన సందర్భంగానే అసెంబ్లీ నియోజకవర్గం కన్వీనర్ తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం ఆ పార్టీలో కలకలం సృష్టించింది అనడంలో ఆశ్చర్యం లేదు.

Oplus_16908288

అసెంబ్లీ కన్వీనర్ మాడ గౌతంరెడ్డి రాజీరామా పత్రం..

బిజెపి అసెంబ్లీ కన్వీనర్ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన మాడ గౌతమ్ రెడ్డి…

———————–++++++++++———————

&పత్రికా ప్రకటనలు(యాడ్స్)&

——————+++++++++————————-

@@వార్షికోత్సవ శుభాకాంక్షలు@@

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!