Social 1080×1350 • Multi-page
19-07-2025 BREAKING NEWS 07:08 PM
swarnodayam.com
Telugu Daily News

విద్యా సంస్థల్లో ముందస్తు బోనాల వేడుకలు

విద్యా సంస్థల్లో ముందస్తు బోనాల వేడుకలు
IMG-20250719-WA0093

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
బోనాల పండుగను పురస్కరించుకొని శనివారం హుజురాబాద్ పట్టణంలోని పలు విద్యాసంస్థల్లో ముందస్తు బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు.

న్యూ కాకతీయ మోడల్ స్కూల్ లో బోనాల జాతర

–మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పట్టణంలోని న్యూ కాకతీయ మోడల్ స్కూల్ లో శనివారం రోజున బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ బద్దుల రాజ్ కుమార్, డైరెక్టర్లు తవుటం గోపాల్, మాసాడి వెంగళరావు లు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాఠశాల ఆవరణంలో రంగ వల్లులు, మామిడి తోరణాలతో అందంగా అలంకరించారు. ఉపాధ్యాయినీలు, విద్యార్థులు సాంప్రదాయ దుస్తులతో బోనం కుండలను పసుపు కుంకుమ, వేపాకులతో అలంకరించుకొని బోనాలు ఎత్తుకొని బోనాల పాటలు, నృత్యాలతో పాఠశాల ఆవరణం చూపరులకు కనువిందు చేశాయి. కరస్పాండెంట్ మాట్లాడుతూ… విద్యార్థులలో ఆధ్యాత్మికత పెంపొందించుటకు బోనాల పండుగ ఎంతగానో ఉపయోగపడుతుందని అని అన్నారు.మన సంస్కృతి, సాంప్రదాయాలను విద్యార్థులు కొనసాగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, రమేష్, శ్రీనివాస్, రమేష్ సమ్మయ్య, ఉపేంద్రా, మానస, ఆశ, మౌనిక అశ్విని, రమా, సంధ్య సరిత, సుకన్య, తదితరులు పాల్గొన్నారు.

విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ లో ఘనంగా బోనాల వేడుకలు

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ జులై 19: హుజురాబాద్ లోని విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ స్కూల్లో ఘనంగా ముందస్తు బోనాల పండుగ వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈ బోనాల పండుగ సందర్భంగా విజ్ఞాన్ స్కూల్ లో ఏర్పాటు చేసిన వేడుకలో కరస్పాండెంట్ దాసరి కోటేశ్వర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ మనందరినీ ఒక్కటి చేసే పండుగ బోనాలు. ఈ పండుగను తెలంగాణ వ్యాప్తంగా మన సాంప్రదాయాలకు గుర్తుగా ప్రతి సంవత్సరం జరుపుకుంటామని తెలిపారు.
అలాగే మన సంస్కృతిని, సంప్రదాయాన్ని గౌరవిస్తూ, రాబోయే తరానికి మూల స్తంభాలైన విద్యార్థినీ విద్యార్థులకు మన పండుగలను తెలియజేయుటకే మన విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ స్కూల్ లో బోనాల పండుగను వేడుకలా సంతోషంగా, ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. ఈ వేడుకలలో విద్యార్థినీ విద్యార్థులు అమ్మవారిగా, పోతురాజులు మరియు వివిధ రకాల వేషాధారణలతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో విజ్ఞాన్ స్కూల్ కరస్పాండెంట్ దాసరి కోటేశ్వర్, డైరెక్టర్ తిరుపతి యాదవ్, ప్రిన్సిపల్ సౌమ్య మరియు కోఆర్డినేటర్ సుమలత తో పాటుగా ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు, తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!