Social 1080×1350 • Multi-page
19-07-2025 BREAKING NEWS 07:37 PM
swarnodayam.com
Telugu Daily News

ఆల్ఫోర్స్ జీనియస్ లో హౌస్ ఎన్నికలు విజయవంతం

ఆల్ఫోర్స్ జీనియస్ లో హౌస్ ఎన్నికలు విజయవంతం
IMG-20250719-WA0102

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజూరాబాద్ లోని ఆల్ఫోర్స్ జీనియస్ స్కూల్ ప్రాంగణంలో జులై 14న జరిగిన హౌస్ ఎన్నికలు ఉత్సాహభరితంగా, ప్రజాస్వామ్య స్ఫూర్తితో నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొని తమ అభిరుచులు, నేతృత్వ లక్షణాలు చాటిచెప్పారు. ప్రతీ హౌస్‌కి చెందిన అభ్యర్థులు ఎన్నికల ప్రచారం, వాదనల ద్వారా తమ అర్హతను నిరూపించుకునే ప్రయత్నం చేశారు. గోప్యమైన ఓటింగ్ విధానంలో విద్యార్థులు ఓట్లు వేసారు.
విజేతల వివరాలను జూలై 19న ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత అయినా డాక్టర్ వి నరేందర్ రెడ్డి చేతుల మీద విజేతలను ప్రమాణ స్వీకారం చేయించారు,
విజేతల వివరాలు:
ధ్రువ హౌస్ కాప్టెన్ ఎండి ఫార్మన్, వైస్ కెప్టెన్ మోక్షజ్ఞ, తేజస్ హౌస్ కాప్టెన్ అమిత్ వర్ధన్, వైస్ కెప్టెన్ అపనుల్లా ఖాన్, సరస్ హౌస్ కాప్టెన్ సిహెచ్ విశ్వాస్ ప్రీతం, వైస్ కెప్టెన్ కే శ్రీహిత,
లక్ష్య హౌస్ కాప్టెన్ ఈ రిషిక, వైస్ కెప్టెన్ కే రిషిక విజేతలయ్యారు.
ఈ సందర్భంగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత
డాక్టర్ వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఈ విధమైన హౌస్ ఎన్నికలు విద్యార్థుల్లో నాయకత్వ గుణాలు, బాధ్యతాయుతంగా వ్యవహరించే స్వభావం, ప్రజాస్వామ్య విలువలను పెంపొందించడంలో కీలక పాత్ర వహిస్తాయి” అన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!