Social 1080×1350 • Multi-page
19-07-2025 BREAKING NEWS 09:41 PM
swarnodayam.com
Telugu Daily News

రంగాపూర్ లో అగ్రికల్చర్ సైన్సెస్ విద్యార్థుల పర్యటన

రంగాపూర్ లో అగ్రికల్చర్ సైన్సెస్ విద్యార్థుల పర్యటన
IMG-20250719-WA0125

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం రంగాపూర్ గ్రామములో అగ్రీకల్చర్ సైన్సెస్ నుండి జమ్మికుంట కెవికెలో శిక్షణ కోసం వచ్చిన విద్యార్థులు గ్రామంలో సేంద్రియ వ్యవసాయం గురించి వివరించారు. అందులో భాగంగా నిమాస్త్ర మరియు బీజామృతం తయారు చేసుకునే విదానం గురించి వివరించారు.
మరియు వాటి ఉపయోగాలు, దీని ద్వారా రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం పొందవచ్చుననీ గ్రామములో సేంద్రియ వ్యవసాయం గురించి హైదరాబాద్ మల్లారెడ్డి యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ విద్యార్థులు సేంద్రీయ వ్యవసాయంలో, పంటలను నాటడానికి ఖరీదైన ఎరువులు, పురుగుమందులు లేదా HYV విత్తనాలు అవసరం లేదు అన్నారు. అందువల్ల, అదనపు ఖర్చు ఉండదు అని చౌకైన, స్థానిక ఇన్‌పుట్‌లను ఉపయోగించడం ద్వారా, ఒక రైతు పెట్టుబడిపై మంచి రాబడిని పొందవచ్చునన్నారు. భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా సేంద్రీయ ఉత్పత్తులకు భారీ డిమాండ్ ఉంది అని ఇది ఎగుమతి ద్వారా ఎక్కువ ఆదాయాన్ని పొందుతుందన్నారు. ఈరోజు గ్రామములో పాల్గొన్న రైతులు స్వామిరెడ్డి, శ్రీనివాస్, గోకుల శ్రీనివాస్, వి రమేష్, కిరణ్ రెడ్డి, సురేష్, బి.రమేష్ కలిసి రైతులకు అవగాహన కల్పించిన పది మంది విద్యార్థులు బి నందిని, పి.శ్రావ్య, వి పూజ, పి.పూజ, పి.ప్రమోదిని, జి.ప్రణీత, ఎ.ప్రసన్న, ఇ.రుచిత, ఆర్.సాత్విక తదితరులు పాల్గొన్నారు.

Oplus_16908288
రంగాపూర్ కు వచ్చిన హైదరాబాద్ మల్లారెడ్డి యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ విద్యార్థులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!