21-07-2025 NORMAL NEWS 04:17 PM
swarnodayam.com
Telugu Daily News
21-07-2025 04:17 PM By Mandala Yadagiri

హుజురాబాద్‌లో ఉద్యోగాల పండుగ.. – జాబ్ మేళా గ్రాండ్ సక్సెస్ – 5,000 మంది యువత హాజరు, ఈ మేళలో పాల్గొన్న 85 కంపెనీలు

హుజురాబాద్‌లో ఉద్యోగాల పండుగ.. – జాబ్ మేళా గ్రాండ్ సక్సెస్ – 5,000 మంది యువత హాజరు, ఈ మేళలో పాల్గొన్న 85 కంపెనీలు
IMG-20250721-WA0065

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, జూలై 21: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో నిరుద్యోగ నిర్మూలన ధ్యేయంగా, యువత ఆర్థికంగా ఎదగాలన్న సంకల్పంతో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం జాబ్ మేళా విజయవంతంగా నిర్వహించబడింది. హుజురాబాద్ పట్టణంలోని సిటీ సెంటర్ ఫంక్షన్ హాల్ వేదికగా జరిగిన ఈ జాబ్ మేళాలో 5,000 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 85 ప్రైవేట్ కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించటంతో వాతావరణం ఉద్యోగ పండుగలా మారింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. “నిరుద్యోగ యువతకు దారి చూపించడమే నా కర్తవ్యం. యువత చేతిలోనే దేశ భవిష్యత్తు ఉంది. ఎక్కడైనా ఉద్యోగం చేసేందుకు సిద్ధంగా ఉండాలి,” అని పిలుపునిచ్చారు. ఆయన స్పష్టం చేసిన విషయం ఏమిటంటే, ఎన్నికల తర్వాత పూర్తిగా అభివృద్ధి, సంక్షేమం కోసమే తన సేవలు అంకితమై ఉన్నాయని తెలిపారు.

అపూర్వ స్పందన – విస్తృత ఏర్పాట్లు

ఈ జాబ్ మేళా కోసం ముందస్తుగా విస్తృత ఏర్పాట్లు చేపట్టారు.
5000 మందికి భోజన ఏర్పాట్లు చేశారు. వాలంటీర్లను, హెల్ప్ డెస్కులను ఏర్పాటుచేసి, ఇంటర్వ్యూల కోసం ప్రత్యేక చాంబర్లు ఏర్పాటుచేసి ఇంటర్వెల్ నిర్వహించారు. గ్రామాల నుండి యువత ఉత్సాహంగా తరలివచ్చారు. చాలామంది తాము నివసిస్తున్న గ్రామాల్లోనే ఉద్యోగం కావాలని భావించినా, ఎమ్మెల్యే యువతను హనుమకొండ, కరీంనగర్, హైదరాబాద్ వంటి పట్టణాల్లోనూ అవకాశాలను పట్టుకోవాలంటూ ప్రోత్సహించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కంపెనీల ప్రతినిధులు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని ప్రశంసించారు. ముందుగా కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావు వంటి నాయకుల స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు కౌశిక్ రెడ్డి తెలిపారు. జాబ్ మేళా విజయవంతం కావడం పట్ల ఆనందోత్సాహం కనిపించింది.

ఈ అవకాశాన్ని వినియోగించుకున్న యువత కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇదే తరహాలో మరిన్ని అవకాశాలు కల్పించాలని కోరారు. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ నాయకులు, సర్పంచులు, వర్డ్ సభ్యులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

జాబ్ మేళా సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి..

పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న నిరుద్యోగ యువత…

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో నిరుద్యోగ యువత చిట్ చాట్…

పెద్ద ఎత్తున హాజరైన నిరుద్యోగ యువతి యువకులు…

వివిధ కంపెనీ నుండి వచ్చిన ప్రతినిధులకు షేక్ హ్యాండిచ్చి కృతజ్ఞతలు తెలుపుతున్న ఎమ్మెల్యే..

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తో సెల్ఫీ దిగేందుకు పోటీ పడ్డ యువతీ యువకులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!