Social 1080×1350 • Multi-page
22-07-2025 BREAKING NEWS 08:15 AM
swarnodayam.com
Telugu Daily News

ఆనందోత్సాహాల నడుమ బ్రాహ్మణుల ఆషాడ వనభోజనాలు..

ఆనందోత్సాహాల నడుమ బ్రాహ్మణుల ఆషాడ వనభోజనాలు..
IMG-20250722-WA0001

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: గాయత్రీ బ్రాహ్మణ సంఘం, హుజురాబాద్ వారి ఆధ్వర్యంలో 21న సోమవారం నిర్వహించిన ఆషాధ వనభోజనాలలో సంఘ సభ్యులు మరియు వారి బంధువులు కెసి క్యాంప్ లోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఆనందోత్సాహాల నడుమ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో లోక కళ్యాణార్థం సకాలంలో వర్షాలు కురావాలని లలిత, విష్ణు, సహస్రనామ స్తోత్రముల పారాయణచేయడం చేశారు. అనంతరం మెహిందీ కార్యక్రమం నిర్వహించి చివరగా సభ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వోడితెల ప్రణవ్ బాబు పాల్గొని తన సహాయ సహకారాలు బ్రాహ్మణ సంఘానికి ఎల్లప్పుడు ఉంటాయని, తప్పకుండా అందరికీ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. అలాగే పారాయణంలో పాల్గొన్న మహిళా మణులకు లక్కీ డ్రా లో గెలుపొందిన వారికి (వెండి కుంకుమ భరణి) ప్రథమ (రామగుండం నర్మద), ద్వితీయ(వల్లూరి స్వాతి), తృతీయ (ఉప్పల దివ్య) బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన సంఘ సభ్యులకు, బంధు మిత్రులకు పేరు పేరున గాయత్రీ బ్రాహ్మణ సంఘం హుజురాబాద్ వారు ధన్యవాదాలు తెలిపారు.

బ్రాహ్మణుల సమావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ నేత వోడితల ప్రణవ్

Oplus_16908288

పరాయణంలో పాల్గొనీ విజేతలైన మహిళలకు బహుమతులు అందజేస్తున్న ప్రణవ్..

అతిథిగా వచ్చిన ప్రణవ్ కు శాలువాతో సత్కరించి జ్ఞాపకం చేస్తున్న గాయత్రి బ్రాహ్మణ సంఘం నాయకులు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!