Social 1080×1350 • Multi-page
22-07-2025 BREAKING NEWS 07:23 PM
swarnodayam.com
Telugu Daily News

అనుమానితులపై నిఘా పెంచాలి.. పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన డిసిపి భీమ్ రావు

అనుమానితులపై నిఘా పెంచాలి.. పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన డిసిపి భీమ్ రావు
IMG-20250722-WA0069

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానితులపై, రౌడీలపై తగిన నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని జిల్లా అడిషనల్ డిసిపి భీమ్ రావు అన్నారు. మంగళవారం హుజూరాబాద్ పోలీస్ స్టేషన్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ లో రికార్డులను ఆయన పరిశీలించారు. పోలీస్ స్టేషన్లో గల వాహనాలు, ప్రాపర్టీ, తదితర రికార్డులను తనిఖీ చేసి వాటి నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం పోలీసు స్టేషన్ కు వచ్చే ఫిర్యాదు దారులను సాదరంగా రిసీవ్ చేసుకుని వారికి న్యాయం జరిగేటట్లు చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ టౌన్ సిఐ టి కరుణాకర్, హుజురాబాద్ రూరల్ సిఐ పులి వెంకటగౌడ్, ఎస్ ఐ లు యూనస్ అహ్మద్ అలీ, డి రాధా కిషన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

పోలీసు సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకుంటున్న డిసిపి భీమ్ రావు

పోలీస్ వాహనాలను పరిశీలిస్తున్న డిసిపి..

పోలీస్ స్టేషన్లో రికార్డులను పరిశీలిస్తున్న డీసీపీ బీమ్ రావు…

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!