Telugu Daily News
అయ్యప్ప దేవాలయానికి దాతల వితరణ..108 పత్రాల వెండి నాగవల్లి,లాకర్ బహుకరణ

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని నవగ్రహ, సంతోషిమాత సహిత, పంచముఖ ఆంజనేయస్వామి, అయ్యప్పస్వామి దేవాలయానికి ఆలయ చైర్మన్ కొత్త అశోక్ రెడ్డి కూతురు మరియు అల్లుడు కోమళ్ల రాధిక – విజేందర్ రెడ్డి దంపతులు దేవాలయంలో గల పంచముఖ ఆంజనేయస్వామికి ఇష్టమైన 108 పత్రాల వెండి నాగవల్లి సమర్పించారు. అలాగే అయ్యప్ప స్వామి దేవాలయానికి లాకర్ (బీరువా) బహుకరించారు. వారికి వారి కుటుంబానికి ఆ ఆంజనేయస్వామి, అయ్యప్ప స్వామి ఆశీస్సులు మరియు దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని ఆలయ నిర్వహకులు, అయ్యప్ప భక్తులు మనస్ఫూర్తిగా దీవించారు.


పంచముఖ ఆంజనేయస్వామికి ఇష్టమైన 108 పత్రాల వెండి నాగవల్లి సమర్పించిన దృశ్యం.

పంచముఖ ఆంజనేయస్వామికి కలంకరించిన తమలపాకుల వెండి నాగవల్లి..

అయ్యప్ప స్వామి దేవాలయానికి దాతలు రాధిక- విజేందర్ రెడ్డి అందజేసిన లాకర్..

