24-07-2025 NORMAL NEWS 02:10 PM
swarnodayam.com
Telugu Daily News
24-07-2025 02:10 PM By Mandala Yadagiri

ఘనంగా వొడితల రాజేశ్వర్ రావు 14వ వర్థంతి వేడుకలు..

ఘనంగా వొడితల రాజేశ్వర్ రావు 14వ వర్థంతి వేడుకలు..
IMG-20250724-WA0037

తాత ఆశయాలను కొనసాగిస్తా..

ప్రజలకు మరింత సేవ చేసేందుకు కృషి చేస్తా..

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, దివంగత ఎంపీ వొడితేల రాజేశ్వరరావు 14వ వర్ధంతిని హుజురాబాద్ పట్టణంలోని సైదాపూర్ క్రాస్ రోడ్ లో ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మనవడు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వోడితెల ప్రణవ్ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యునిగా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకునిగా అనేక సేవలు అందించిన మహోన్నత వ్యక్తి అని, వారి బాటలో నడుస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.పేద కుటుంబంలో జన్మించిన వారు విద్యకు దూరం కావొద్దని ఆలోచించిన వ్యక్తి రాజేశ్వర్ రావు అని, ఆనాటి ప్రధానమంత్రి పివీ.నరసింహరావుకు చేదోడు వాదోడుగా ఉండి ఆపద సమయంలో దేశ రాజకీయాల్లో తన వంతు సహాయం చేసి రాజకీయ చతురత ప్రదర్శించారని ఆయన సేవలు గుర్తు చేసుకున్నారు. తాత వారసుడిగా ఆయన ఆశయాలను కొనసాగిస్తూ విద్య, వైద్య విషయంలో ముందుండి పేద ప్రజలకు మరింత సేవ చేస్తానని తెలిపారు. అనంతరం పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అభిమానులు, నాయకులతో, కార్యకర్తలతో కలిసి ప్రణవ్ భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్, జమ్మికుంట, కమలాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ లు, సింగిల్ విండో చైర్మన్లు, రాజేశ్వరరావు అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మెయిన్ రోడ్డులోని రాజేశ్వరరావు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న మనవడు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రణవ్..

కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద రాజేశ్వరరావు చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న ప్రణవ్, కాంగ్రెస్ నాయకులు..

వర్ధంతి సందర్భంగా మెయిన్ రోడ్డులోని డివైడర్లలో మొక్కలు నాటుతూ.. నీళ్లు పోస్తున్న ప్రణవ్..

అన్నం వడ్డించి, కార్యకర్తలతో కలిసి తింటున్న ప్రణవ్..

పార్టీ కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి మాట్లాడుతున్న ప్రణవ్

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!