24-07-2025 NORMAL NEWS 04:45 PM
swarnodayam.com
Telugu Daily News
24-07-2025 04:45 PM By Mandala Yadagiri

గూడ జగదీశ్వర్ శర్మ జన్మదినాన్ని పురస్కరించుకుని అన్న వితరణ.

గూడ జగదీశ్వర్ శర్మ జన్మదినాన్ని పురస్కరించుకుని అన్న వితరణ.
IMG-20250724-WA0105

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: వీణవంక మండల వాస్తవ్యులు జ్యోతిష్య బ్రహ్మ, పూజ్యులు, శ్రీ గూడ జగదీశ్వర్ శర్మ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన జన్మదిన వేడుకలు హుజురాబాద్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ రోజు వారి పేరు మీద అన్నదాన కార్యక్రమంను నిర్వహించడం జరిగింది. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, వారు మరెన్నో జన్మదిన వేడుకలు నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమాన్ని వాసవి అన్నపూర్ణ సేవా సమితి హుజురాబాద్ వారు స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ గందె రాధిక శ్రీనివాస్, వాసవి అన్నపూర్ణ సేవా సమితి నాయకులు, సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

అన్న వితరణ చేస్తున్న.. మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ దంపతులు గందె రాధికా శ్రీనివాస్..
వాసవి అన్నపూర్ణ సేవా సమితి హుజురాబాద్ వారు అన్న వితరణ నిర్వహిస్తున్న దృశ్యం..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!