Social 1080×1350 • Multi-page
24-07-2025 BREAKING NEWS 09:20 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ ఏరియా ఆసుపత్రి టీజీఎంఈయు నూతన కార్యవర్గం ఎన్నిక

హుజురాబాద్ ఏరియా ఆసుపత్రి టీజీఎంఈయు నూతన కార్యవర్గం ఎన్నిక
IMG-20250724-WA0152

మండల యాదగిరి స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఏరియా ఆసుపత్రి టీజీఎంఈయు నూతన కార్యవర్గంను గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా జోష్ణ ప్రియదర్శిని, పద్మ, కార్యదర్శులుగా శోభ, జమునరాణి, సహాయ కార్యదర్శులుగా స్రవంతి, రోజా రాణి, కోశాధికారిగా కనకలక్ష్మి, కార్యవర్గ సభ్యులుగా స్వప్న, సుభాషిని, స్వరూప, రాజేశ్వరి, భాగ్యలక్ష్మిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం తెలంగాణ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ వజ్రోత్సవాలను ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు స్వాతి ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ నారాయణ రెడ్డి హాజరై మాట్లాడుతూ… తెలంగాణ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో మెడికల్ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని అన్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలని ఆయన తెలిపారు. మెడికల్ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించే కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Oplus_16908288

నూతనంగా ఎన్నికైన హుజురాబాద్ ఏరియా ఆసుపత్రి టీజీఎంఈయు నాయకులు..

కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న ముఖ్య అతిథులు..

యూనియన్ ఉద్దేశించి మాట్లాడుతున్న ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ నారాయణరెడ్డి…

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!