Social 1080×1350 • Multi-page
25-07-2025 BREAKING NEWS 09:44 PM
swarnodayam.com
Telugu Daily News

సీఎం, మంత్రులపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం..

సీఎం, మంత్రులపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం..
IMG_20250725_214031

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హైదరాబాదులోని తెలంగాణ భవన్లో టిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ నాయకులు హుజూరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. కౌశిక్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ముఖ్యమంత్రి, మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగాయి. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి వ్యతిరకంగా నినాదాలు చేశారు. ఓటు వేయకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటా అని నియోజకవర్గ ప్రజలను మభ్యపెట్టి గెలిచి, ఇప్పుడు పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటని, ముఖ్యమంత్రి, మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి మాటలు భేషరతుగా వెనక్కి తీసుకోవాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మతో నిరసన వ్యక్తం చేసి దగ్ధం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు..

హుజురాబాద్ పోలీస్ స్టేషన్లో సిఐకి కౌశిక్ రెడ్డి పై ఫిర్యాదు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!