25-07-2025 NORMAL NEWS 09:53 PM
swarnodayam.com
Telugu Daily News
25-07-2025 09:53 PM By Mandala Yadagiri

27 న జరిగే ‘జ్ఞాపకాల ఊరేగింపు’ పుస్తకావిష్కరణ సభను విజయవంతం చేయండి.. – హుజురాబాద్ జన సాహితి

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రచయిత, జర్నలిస్ట్ ఆవునూరి సమ్మయ్య రాసిన”జ్ఞాపకాల ఊరేగింపు” పుస్తకావిష్కరణ సభని విజయవంతం చేయాలని జన సాహితి, హుజురాబాద్ సభ్యులు ఒక ప్రకటన లో కోరారు. ఈ నెల 27 ఆదివారం రోజున హుజూరాబాద్ క్లబ్ ఆవరణలోని వి.ఎల్.ఆర్.కన్వెన్షన్ లో ఉదయం 11 గంటలకు ప్రముఖ రచయిత, వీక్షణం పత్రిక సంపాదకులు ఎన్.వేణుగోపాల్ ఈ వ్యాస సంపుటిని ఆవిష్కరిస్తారని న్యాయవాది, కవి, జర్నలిస్ట్ ముక్కెర రాజు అధ్యక్షతన జరిగే ఈ ఆవిష్కరణ సభలో సాహితివేత్తలు డా.ఎస్.తిరుపతయ్య, పుప్పాల శ్రీరాం, విప్లవ్ దత్ శుక్లా, హుస్సేన్, కందుకూరి అంజయ్య లు ప్రసంగిస్తారని వారు పేర్కొన్నారు. పుస్తకావిష్కరణ సభలో సాహిత్య సృజనకారులు, కళాకారులు, సాహిత్యాభిమానులు, సామాజిక ఉద్యమ కారులు, ప్రజాసంఘాల బాధ్యులు అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పల్కల ఈశ్వర్ రెడ్డి, రవిశంకర్ శుక్లా
వేల్పుల రత్నం, భీమోజు సదానందం, పొడిశెట్టి వెంకటారాజం,
వేల్పుల ప్రభాకర్, మార్త రవీందర్, టి.ఎస్.సింగ్, పూలు జగన్నాధం, బండి రమేష్, కొత్తూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!