Social 1080×1350 • Multi-page
25-07-2025 BREAKING NEWS 11:12 PM
swarnodayam.com
Telugu Daily News

గురుకులాలకు నూతన భవనాలను నిర్మించాలి.. – ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి కేశబోయిన రాము

గురుకులాలకు నూతన భవనాలను నిర్మించాలి.. – ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి కేశబోయిన రాము
IMG_20250725_231008

గురుకులాల్లో విద్యార్థులకు రక్షణ లేదు

గురుకులను పట్టించుకోని ప్రజా ప్రభుత్వం

– ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి కేశబోయిన రాము

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న బిసి గురుకుల విద్యాలయాలను, సంక్షేమ హాస్టళ్లలను శుక్రవారం సందర్శించి విద్యార్థులను వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి కేశబోయిన రాము యాదవ్ మాట్లాడుతూ హుజురాబాద్ నియోజకవర్గంలో నడుస్తున్న మహాత్మ జోతిరావు పూలే గురుకుల సంక్షేమ హాస్టళ్లు అద్దె భవనాల్లో నడుస్తున్న హాస్టళ్లకు నూతన భవనాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని, అలాగే విద్యార్థులకు నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని అందించాలని ప్రస్తుతం ఉన్న వర్షకాలం సందర్భంగా రగ్గులు బెడ్స్ ఇవ్వాలని కోరారు. గురుకులాలు సమస్యలు నిలియంగా మారాయని తరచుగా గురుకులలో ఫడ్ పాయిజన్ లు జరగడం వల్ల విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారని, గురుకులాలు ఆపరిశుభ్రంగా ఉండడంవల్ల ఎలుకలు హాస్టల్లోకి వచ్చి విద్యార్థులకు కాట్లు వేస్తున్నాయని, గురుకుల విద్యార్థులకు రక్షణ లేకుండా పోతుందని వారి ప్రాణాలతో ప్రభుత్వం అధికారులు చెలగాటం ఆడుతున్నారని, వీణవంక, సైదాపూర్ మండలాల మహాత్మ జోతిరావు పూలే గురుకుల సంక్షేమ హాస్టళ్లకు నూతన భవనాలను నిర్మించాలని సంక్షేమ హాస్టల్ విద్యార్థుల సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తుందని, సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించి అద్దె భవనాల్లో నడుస్తున్న హాస్టళ్లకు నూతన భవనాలను నిర్మించాలని,లేనిపక్షంలో విద్యార్థులను ఏకం చేసి జిల్లా కలెక్టరేట్ ముట్టడిస్తామని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి కేశబోయిన రాము యాదవ్ హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి రాంపెళ్లి రోహిత్, నాయకులు గణేష్, రాజేష్ తదితరులు పాల్గోన్నారు.

బీసీ వసతి గృహాలను పరిశీలిస్తున్న ఏఐఎస్ఎఫ్ నాయకులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!