Social 1080×1350 • Multi-page
26-07-2025 BREAKING NEWS 12:46 PM
swarnodayam.com
Telugu Daily News

జమ్మికుంట రూరల్ లో టెన్త్ విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ చేసిన బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి..

జమ్మికుంట రూరల్ లో టెన్త్ విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ చేసిన బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి..
IMG-20250726-WA0058

– మోదీ కానుకగాటెన్త్ క్లాస్ విద్యార్ధినీ, విద్యార్థులందరికీ సైకిళ్లు అందిస్తున్న కేంద్రమంత్రి బండి సంజయ్

– బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ..

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (జమ్మికుంట): కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుకునే విద్యార్ధినీ, విద్యార్థులందరికీ మోడీ కానుకగా కేంద్ర మంత్రి బండి సంజయ్ జన్మదినోత్సవం సందర్భంగా సైకిళ్ల పంపణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, ఆ ప్రోగ్రాంలో భాగంగానే జమ్మికుంట రూరల్ విద్యార్థిని విద్యార్థులకు సైకిళ్లను శనివారం రోజున అందించడం జరిగిందని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తెలిపారు. జమ్మికుంట రూరల్ లోనీ ప్రభుత్వ పాఠశాల 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు శనివారం రోజున సైకిళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన గంగాడి కృష్ణారెడ్డి ముందుగా విద్యార్థిని విద్యార్థులకు సైకిల్లను పంపిణీ చేసి మాట్లాడారు. ప్రధానమంత్రి ‘‘నరేంద్రమోదీ కానుక’’ పేరుతో కేంద్ర మంత్రి బండి సంజయ్ స్వయంగా వివిధ సంస్థల నుండి సేకరించిన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సీఎస్సార్) నిధులతో ఈ సైకిళ్లను కొనుగోలు చేసి పేద విద్యార్థులకు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో దాదాపు 20వేల సైకిలను కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ విద్యార్థినీ విద్యార్థులకు అందజేసే మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. పార్లమెంట్ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు మొత్తం 20 వేల సైకిళ్లను దశలవారీగా పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే విద్యార్థినీ విద్యార్థులు పేద కుటుంబం నుండి వచ్చిన వాళ్లే అధిక శాతం ఉంటారని, ఆ పిల్లలు తమ ఇంటి నుండి స్కూల్ దాకా వెళ్లడానికి తగిన రవాణా సౌకర్యాల్లేక, ఆటోలు, బస్సులు వెళ్లే స్థోమత లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విద్యార్థుల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని టెన్త్ బాలబాలికలకు రవాణా ఇబ్బంది ఉండకూడదనే సదుద్దేశంతో బండి సంజయ్ కుమార్ ప్రధాని మోదీ కానుకగా సైకిళ్లను పంపిణీ చేస్తున్నారని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సంపెల్లి సంపత్ రావు, జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్ రావు, ఓబిసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్, మండల ప్రధాన కార్యదర్శి పుల్లూరు ఈశ్వర్, మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు గిరవేణి ఐలయ్య యాదవ్, మండల కార్యదర్శి సమ్మయ్య, ఇల్లందు రాజమల్లు, బూత్ అధ్యక్షులు గుడ్ల రాజు, రవి, శ్రీను, రాకేష్, అలాగే ప్రధానోపాధ్యాయులు సమ్మయ్య, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

Oplus_16908288

పదవ తరగతి విద్యార్థులకు సైకిల్స్ పంపిణీ చేస్తున్న బిజెపి జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి…

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!