Social 1080×1350 • Multi-page
26-07-2025 BREAKING NEWS 06:17 PM
swarnodayam.com
Telugu Daily News

జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన హుజురాబాద్ క్రీడాకారులు

జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన హుజురాబాద్ క్రీడాకారులు
IMG_20250726_181320

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఇటీవల ఆర్మూర్ లో జరిగిన రాష్ట్రస్థాయి సీనియర్ కబడ్డీ పోటీలలో అత్యంత ప్రతిభ కనబరిచి హుజురాబాద్ కు చెందిన కాశిరెడ్డి గౌతమ్, మేకల ప్రభాత్ విష్ణువర్ధన్, వేల్పుల రమ్య అనే క్రీడాకారులు జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 13వ తేదీన ఆర్మూర్ లో తెలంగాణ హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడోత్సవాల జరగగా అందులో పాల్గొని అత్యంత ప్రతిభ కనబరచడంతో వీరిని జాతీయ స్థాయికి ఎంపిక చేశారు. ఈనెల 25, 26, 27, 28 తేదీలలో చండీగర్ లో జరిగే జాతీయస్థాయి పోటీలలో ముగ్గురు క్రీడాకారులు పాల్గొన్నారు కరీంనగర్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ సొల్లు సారయ్య తెలిపారు. కాగా వీరి ఎంపిక పట్ల అసోసియేషన్ సెక్రెటరీ బి. తిరుపతి గౌడ్, జాయింట్ సెక్రెటరీ M.అంజయ్య, పలువురు క్రీడాకారులు అభినందించారు.

జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన హుజురాబాద్ కు చెందిన కాశిరెడ్డి గౌతమ్, మేకల ప్రభాత్ విష్ణువర్ధన్, వేల్పుల రమ్య…

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!