Social 1080×1350 • Multi-page
26-07-2025 BREAKING NEWS 07:56 PM
swarnodayam.com
Telugu Daily News

సీఎం రేవంత్ రెడ్డిపై పోలీస్ స్టేషన్ లో బిఆర్ఎస్ నేతల ఫిర్యాదు

సీఎం రేవంత్ రెడ్డిపై పోలీస్ స్టేషన్ లో బిఆర్ఎస్ నేతల ఫిర్యాదు
FB_IMG_1753539418831

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: మాజీమంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అసత్య ఆరోపణలు చేస్తూ ఆయన వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం హుజూరాబాద్ పట్టణంలో బిఆర్ఎస్ నాయకులు హుజురాబాద్ టౌన్ సిఐ కరుణాకర్ కు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రాజకీయ విమర్శలు చేయడం వేరు, వ్యక్తిత్వాన్ని తగ్గిస్తూ అవమానపరుస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నాడని అన్నారు మహిళల ఆత్మగౌరవాన్ని కూడా కించపరుస్తున్నాడని అన్నారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఆయన స్థాయికి తగ్గి ఇష్టం వచ్చిన రీతిలో కేటీఆర్ పై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు ఇలాంటి ఆరోపణలు చేయడం సీఎం రేవంత్ రెడ్డి మానుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్ కొండాల్ రెడ్డి మాజీ కౌన్సిలర్లు ప్రతాప తిరుమల్ రెడ్డి, ఏ ముత్యంరాజు, ముక్క రమేష్ , కుమారస్వామి, ఉమామహేశ్వర్, నాయకులు గందె శ్రీనివాస్, నరేష్, కృష్ణ, కుమార్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.

హుజురాబాద్ టౌన్ సిఐకి సీఎం రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేస్తున్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!