Social 1080×1350 • Multi-page
26-07-2025 BREAKING NEWS 08:23 PM
swarnodayam.com
Telugu Daily News

ఎలుకలు కొరికిన గురుకుల పాఠశాలను సందర్శించిన డిఎంహెచ్ఓ

ఎలుకలు కొరికిన గురుకుల పాఠశాలను సందర్శించిన డిఎంహెచ్ఓ
IMG-20250726-WA0093

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ పట్టణ శివారులోని బోర్నపల్లిలో ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే బాలుర గురుకుల పాఠశాలను శనివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ తన సిబ్బందితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వంటగదిని, బాత్రూములను హాస్టల్ పరిసరాలను గమనించారు. వంట చేసే సిబ్బందికి తగు సూచనలు ఇచ్చారు. తరువాత ఎలుక లు కొరికిన విద్యార్థులను పరిశీలించారు. హాస్టల్లో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని బాలురకు తగిన వైద్య చికిత్స అందించాలని ఆదేశించారు. పిల్లలను ఎలుకలు , పాముల బారి నుండి కాపాడాలని హాస్టల్లో తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్ రాణికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎలాబోతారం పల్లె దవాఖాన వైద్యాధికారిని డాక్టర్ మీనాక్షి, జిల్లా హెల్త్ ఎడ్యుకేటర్ పంజాల ప్రతాప్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శ్యామ్ పాల్గొన్నారు.

గురుకులంలోని వంటగదిని పరిశీలిస్తున్న జిల్లా వైద్యాధికారి, ఇతర అధికారులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!