Social 1080×1350 • Multi-page
27-07-2025 BREAKING NEWS 01:21 PM
swarnodayam.com
Telugu Daily News

ఉప్పల్ ఆర్వోబీ నిర్మాణంలో కీలక మెట్టు… రైళ్లను ఆపి గడ్డర్లు బిగించిన రైల్వే శాఖ

ఉప్పల్ ఆర్వోబీ నిర్మాణంలో కీలక మెట్టు… రైళ్లను ఆపి గడ్డర్లు బిగించిన రైల్వే శాఖ
IMG-20250727-WA0055(1)

––చెన్నై నుంచి స్పెషల్ క్రేన్‌తో రాత్రంతా యుద్ధప్రాతిపదికన పనులు

–కేంద్ర మంత్రి బండి సంజయ్ వార్నింగ్‌తో ఊపందుకున్న నిర్మాణం

–ఆగస్టు చివరికల్లా పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన రైల్వే అధికారులు

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ ఉమ్మడి జిల్లా జమ్మికుంట- ఉప్పల్ ఆర్వోబీ నిర్మాణంలో కీలక ఘట్టం ముగిసింది. సంవత్సరాలుగా వాయిదాపడుతున్న పనులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చొరవతో మోక్షం లభించింది. రైల్వే లైన్‌పై గడ్డర్లను బిగించేందుకు అవసరమైన స్పెషల్ క్రేన్ రాష్ట్రంలో అందుబాటులో లేకపోవడంతో చెన్నై నుంచి తెప్పించారు. ఈ క్రమంలో మూడు గంటల పాటు రైళ్ల రాకపోకలను నిలిపివేసి పనులు జరిపారు.

ఈ ప్రాజెక్టు ఆలస్యంపై మంత్రి బండి సంజయ్ ఇటీవల కమలాపూర్ వెళ్తుండగా చూసి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఆయన ఆదేశాలతో తక్షణమే చర్యలు చేపట్టిన రైల్వే శాఖ, స్పెషల్ క్రేన్‌తో పాటు మరో క్రేన్‌ను వినియోగించి పనులు వేగంగా పూర్తిచేసింది. గడ్డర్ల బిగింపు పూర్తయిన నేపథ్యంలో మిగిలిన పనులు వేగంగా పూర్తి చేసి ఆగస్టు నెలాఖరులోపు ఆర్వోబీని ప్రజల సేవకు అందుబాటులోకి తేవాలని అధికారులు వెల్లడించారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!