Social 1080×1350 • Multi-page
27-07-2025 BREAKING NEWS 01:57 PM
swarnodayam.com
Telugu Daily News

డిబిఎల్ కంపెనీ సిబ్బంది నిర్లక్ష్యం…నీటా మునిగిన పంట పొలాలు..

డిబిఎల్ కంపెనీ సిబ్బంది నిర్లక్ష్యం…నీటా మునిగిన పంట పొలాలు..
IMG-20250727-WA0064

– నష్టానికి బాధ్యులెవరు…!?’’-రాంపూర్ రైతుల ఆక్రందన

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్, జూలై 27: కరీంనగర్ – వరంగల్ మధ్య నిర్మాణంలో ఉన్న మినహాయింపు రహదారి (బైపాస్ రోడ్) పనుల వల్ల పంట పొలాల్లోకి వరద నీరు చేరి, రైతులు తీవ్ర నష్టానికి గురవుతున్నారు. హుజూరాబాద్ మండలం రాంపూర్ గ్రామంలో పరిస్థితి అత్యంత దయానీయంగా మారింది…రహదారి నిర్మాణ సమయంలో వర్షపు నీరు వెళ్లే మళ్లింపులు, కాల్వలు నిర్లక్ష్యంగా మూసివేయడంతో, పొలాలు నీట మునిగిపోయాయి. వానలకు పంట నష్టపోయిన రైతులు, ఈ నిర్మాణ పనుల కారణంగా ఇంకోసారి నష్టపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

> ‘‘ఏ విధమైన ముందస్తు సన్నాహాలు లేకుండా నిర్మాణం చేపడితే మా నష్టానికి బాధ్యులెవరు….?’’
– బాధిత రైతుల ఆవేదన

రైతుల వివరాల ప్రకారం.. సంబంధిత శాఖ సూపర్వైజర్లను అడిగినప్పటికీ సరైన సమాధానం లేకపోవడంతో వారి బాధలు మరింత పెరిగాయి. అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటోందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి, వరద నీటి నిష్క్రమణకు తగిన ఏర్పాట్లు చేసి, పంటలను రక్షించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Oplus_16908288
Oplus_16908288
Oplus_16908288
Oplus_16908288
Oplus_16908288

డిపిఎల్ కంపెనీ రోడ్డు నిర్మాణంలో నిర్లక్ష్యం వహించడంతో వరద నీరు పొలాలకు వెళ్లి పంటపొలాలు పాడవుతున్న దృశ్యాలు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!