27-07-2025 NORMAL NEWS 08:27 PM
swarnodayam.com
Telugu Daily News
27-07-2025 08:27 PM By Mandala Yadagiri

ప్రజలకై పోరాటం చేసే వారిని స్మరించుకోవాలి.. – సీనియర్ జర్నలిస్ట్, రచయిత ఆవునూరి సమ్మయ్య రచించిన జ్ఞాపకాల ఊరేగింపు అనే పుస్తకావిష్కరణ.

ప్రజలకై పోరాటం చేసే వారిని స్మరించుకోవాలి.. – సీనియర్ జర్నలిస్ట్, రచయిత ఆవునూరి సమ్మయ్య రచించిన జ్ఞాపకాల ఊరేగింపు అనే పుస్తకావిష్కరణ.
IMG_20250727_202121

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రజలకై పోరాటం చేసే వీరులను స్మరించుకోవాలని వీక్షణం ఎడిటర్ ఎన్ .వేణుగోపాల్ అన్నారు. ఆదివారం స్థానిక వీఎల్ఆర్ కన్వెన్షన్ హాల్ లో హుజురాబాద్ పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్, రచయిత ఆవునూరి సమ్మయ్య రచించిన జ్ఞాపకాల ఊరేగింపు అనే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసులను హత్య చేస్తున్నారని ఆయన అన్నారు. ఆపరేషన్ కగార్ ను నిలిపివేసే వరకు ప్రజా ఉద్యమాలు చేయాలని ఆయన ప్రజలను కోరారు. ఇప్పటికే మావోయిస్టులను, ఆదివాసి ప్రజలను కేంద్ర ప్రభుత్వంలో ని ప్రధాని మోడీ హత్య చేశారని ఆయన పేర్కొన్నారు. ప్రజా పోరాటాల్లో అసువులు బాసిన అమరులను స్మరించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల పక్షాన పోరాడే వారికి ప్రజలు అండగా నిలవాలని అన్నారు. ప్రజా ఉద్యమాల్లో అసువులు బాసిన వారి చరిత్రను ప్రతి ఒక్కరూ రాయాలని అన్నారు. సీనియర్ కళాకారుడు రామంచ భరత్ ఆధ్వర్యంలో కళాకారుల ఆటపాట స్థానికులను ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో కవి, జర్నలిస్ట్ ఆవునూరి సమ్మయ్య, ముక్కెర రాజు, విప్లవదథ్ శుక్ల, వేల్పుల రత్నం, పల్కల ఈశ్వర్ రెడ్డి, బండ శ్రీనివాస్, సదానందం, వెంకటరాజం, ప్రభాకర్, రవీందర్, రవీందర్ రావు, కాశెట్టి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సభను ఉద్దేశించి మాట్లాడుతున్న వీక్షణం ఎడిటర్ ఎన్ .వేణుగోపాల్…

Oplus_16908288

సభా వేదికపై ఆసీనులైన ముఖ్య అతిథులు..

పుస్తకావిష్కరణకు హాజరైన విద్యావేత్తలు, దళిత, ప్రజాసంఘాల నాయకులు, మేధావులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!