Social 1080×1350 • Multi-page
28-07-2025 BREAKING NEWS 08:32 PM
swarnodayam.com
Telugu Daily News

టాటా బిల్డింగ్ ఇండియా ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు

టాటా బిల్డింగ్ ఇండియా ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు
IMG-20250728-WA0044

మండల యాదగిరి స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: భారతీయ ప్రతిష్టాత్మక దిగ్గజ సంస్థ టాటా వారి టాటా బిల్డింగ్ ఇండియా ఆధ్వర్యంలో హుజురాబాద్ మండలం సింగాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం విద్యార్థిని విద్యార్థులకు వ్యాస రచన పోటీ నిర్వహించారు. ఈ పోటీలలో జూనియర్స్, సీనియర్స్ విభాగంలో 6 గురు విద్యార్ధులను ఎంపిక చేశారు. సీనియర్స్ విభాగంలో మొదటి స్థానం గుండవేని తిరుమల, రెండవ స్వర్గం తేజస్విని, మూడవ స్థానంలో మిడిదొడ్డి శ్రీవల్లి,
జూనియర్స్ విభాగంలో మొదటి స్థానం జోంగోని పూజిత,
రెండవ తిప్పారపు ద్రాక్షతాయి, మూడవ ఓల్లాల సాయి తేజ
గెలుపొందగా ఆ విద్యార్థులకు ప్రధానోపాధ్యాయుడు, మండల విద్యాధికారి భూపతి శ్రీనివాస్ చేతుల మీదుగా మెడల్స్ మరియు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాద్యాయులు, టిబిఐ ఆర్గనైజర్ అంజలి, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

విజేతలతో ఎంఈఓ శ్రీనివాస్, పాఠశాల ఉపాధ్యాయులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!