Social 1080×1350 • Multi-page
28-07-2025 BREAKING NEWS 09:11 PM
swarnodayam.com
Telugu Daily News

13వ వార్డు అంబేద్కర్ యూత్ అసోసియేషన్ నూతన కమిటీకి ఘన సన్మానం

13వ వార్డు అంబేద్కర్ యూత్ అసోసియేషన్ నూతన కమిటీకి ఘన సన్మానం
IMG_20250728_210822

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, జూలై 28: హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలోనీ 13వ వార్డు ఇందిరానగర్ కాలనీలో అంబేద్కర్ యూత్ అసోసియేషన్ నూతన కమిటీ నాయకులను స్థానిక నాయకులు, గ్రామ పెద్దల సమక్షంలో ఘనంగా సన్మానం జరిగింది. ఇటీవల నియామకమైన అంబేద్కర్ యూత్ అసోసియేషన్ నూతన అధ్యక్షునిగా మోరె ఉపేందర్, ప్రధాన కార్యదర్శిగా కుక్కమూడి తిరుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా నియామకం కావడంను పురస్కరించుకొని ఇందిరానగర్ కాలనీలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సన్మాన కార్యక్రమానికి హుజురాబాద్ పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు యేముల పుష్పలత ముఖ్య అతిథిగా హాజరై, నూతన అధ్యక్ష, కార్యదర్శులను శాలువాలతో సన్మానించి, స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యువత సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని, అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సమాజ శ్రేయస్సు కోసం పాటుపడేందుకు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మహంకాళి కొమురయ్య, కొండ్ర మల్లయ్య, కొలుగూరి బిక్షపతి, మోర్ మహేష్, కొలుగూరి సమ్మయ్య, కొలుగూరి శ్రీను, వెలిశాల నారాయణతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన మోరె ఉపేందర్, కుక్కమూడి తిరుపతిలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని, వారి కార్యకలాపాలకు అన్ని విధాలా సహకరిస్తామని వారు హామీ ఇచ్చారు.
అలాగే, యూత్ సభ్యులైన అరవింద్, నాగరాజు, సాగర్, గరిగె శివ, మోరే కృష్ణ, హీరా సింగ్, బచన్ సింగ్, జీత్ సింగ్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని, నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. ఇందిరానగర్ కాలనీ అభివృద్ధికి, యువత సంక్షేమానికి నూతన కమిటీ కృషి చేయాలని ఆకాంక్షించారు.

నూతనంగా ఎన్నికైన అంబేద్కర్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులకు స్వీట్ తినిపించి, శాలువా కప్పి సత్కరిస్తున్న కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు యేముల పుష్పలత రవికుమార్..

అంబేద్కర్ సంఘం నూతన కమిటీని అభినందిస్తున్న పుష్పలత, గ్రామ పెద్దలు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!